టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమవబోతున్నారట !

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చెప్పారు. మరొకరితో చర్చలు జరుపుతున్నారని ఆయన కూడా రెడీ అయితే అందరూ కలిసి వెళ్లి విలీనం అయిపోతారని రేవంత్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుందని.. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

హ్యాపీ రావు అంటే ఎంపీ సంతోష్ రావు ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటీవల సంతోష్ రావు సన్నిహితులపై ఈడీ దాడులు జరగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ ఈ విషయాన్ని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ ఎంపీలుపార్టీలు మారుతారన్న గుసగుసలు మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు.

గతంలో టీడీపీ ఎంపీలు కూడా ఇలాగే వెళ్లి బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టీఆర్ఎస్ వస్తుందని రేవంత్ చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో స్పష్టత లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదని కొంత మంది చెబుతున్నారు. జాతీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చుకుంటే.. బీజేపీనే బెటరనిఎంపీలు ఫీలైతే మాత్రం ఇది త్వరలోనే జరగొచ్చన్న అంచనాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close