శశిధరూర్‌పై రివెంజ్ తీర్చుకున్న రేవంత్ రెడ్డి !

శశిథరూర్‌ టీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా మాట్లాడిన విషయంపై మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆయనను గాడిదగా అభివర్ణించారు. నైతికత మరిచిన ఓ జర్నలిస్ట్ చిట్ చాట్‌ను రికార్డు చేసి కేటీఆర్‌కు ఇచ్చారు. కేటీఆర్ ఆ రికార్డును సోషల్ మీడియాలో పెట్టి శశిథరూర్‌ను ఇలా కించ పర్చిన వ్యక్తికి టీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. ఆ సమయంలో శశిథరూర్‌కు మద్దతుగా కొంత మంది సీనియర్లు వచ్చారు. విషయం పెద్దది కాకుండా వెంటనే రే్వంత్ రెడ్డి శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. వెంటనే విషయం సద్దుమణిగిపోయింది.

ఇప్పుడు శశిథరూర్‌కు రేవంత్ రెడ్డి అవసరం పడింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధరూర్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఏ ఒక్క నేత ఎయిర్ పోర్టుకు వెళ్లలేదు. ఓ పది మంది కార్యకర్తలు మాత్రం ఆయన కోసం జెండాలు పట్టుకుని వచ్చారు. వారిని కూడా రేవంత్ వ్యతిరేక వర్గీయులు మొబిలైజ్ చేశారు. కానీ వారి నేతలు మాత్రం స్వాగతానికి రాలేదు. హైదరాబాద్ వచ్చి ఓటు హక్కు ఉన్న ఏఐసిసి ప్రతినిధుల్ని కలుద్దామని శశిధరూర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే.. తన సమీప బంధువు చనిపోయారని రాలేనని రేవంత్ చెప్పారు.

రేవంత్ సహకరించే చాన్స్ లేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో అందరి మద్దతు ఖర్గేకే ఉండనుంది. అయితే రేవంత్ శశిథరూర్‌కు అలా చెప్పిన గంటలోపే గాందీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై రేవంత్ విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ .. శశిథరూర్‌ను దూరం పెట్టడానికే ఆ కారణం చెప్పారని స్పష్టత వచ్చినట్లయింది. శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మద్దతూ లేదు. కేరళలో కూడా ఆయనకు మద్దతు లభించలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close