ఏపీ మంత్రుల పీఆర్వోల జీతాల బడ్జెట్ నెలకు రూ. 32 లక్షలు..!

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల ఖర్చు నెలకు రూ. 32 లక్షల 35వేలు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాభై మంది పీఆర్వోలు, వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఇలా… వివిధ రకాల కేటగిరీల కింద.. 142 మందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకునేందుకు ఉత్తర్వాలు జారీ చేసింది. వీరిలో కేటగిరీల వారీగా జీతాలను ఖరారు చేసింది. నెలకు వీరందరికీ అయ్యే బడ్జెట్ రూ. 32 లక్షల 35వేలు. వీరికి సీఎంవో పీఆర్వోలు అదనం. ఎవరెవర్ని నియమించుకోవాలన్నదానిపై.. మంత్రులకే స్వేచ్చ ఇచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. జీతాలు, పెన్షన్లు తప్ప.. ఏ ఇతర బిల్లులకు చెల్లింపులు చేయవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ఆర్థిక శాఖ వర్గాలు ఇచ్చాయి. ఇలాంటి సమయంలో… కేవలం.. పీఆర్వోల కోసమే.. ఏకంగా నెలకు ..రూ. 32 లక్షల రూపాయలు జీతాలుగా వ్యయం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం… విమర్శలకు కారణం అవుతోంది. గత మూడు నెలలుగా… మంత్రులకు పీఆర్వోలు లేకపోయినా… ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ఎవరికి వారు.. తమకు సన్నిహితులైన జర్నలిస్టులతో పని కానిచ్చుకున్నారు. ఇప్పుడు వారినే.. అధికారికంగా నియమించుకుని ప్రభుత్వం తరపున జీతాలిచ్చేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

ఇవన్నీ జీతాలేనని… పీఆర్వోలకు.. మళ్లీ ప్రత్యేకంగా కార్యాలయాలు కేటాయిచడం.. ఇతర ఖర్చులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండి.. ఆదాయం పడిపోయిన సమయంలో.. ప్రబుత్వం ఇలా… ముందూ వెనుక ఆలోచించకుండా.. పెద్ద ఎత్తున పీఆర్వో వ్యవస్థకు ఆమోదం తెలుపడమే ఆశ్చర్యకరంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ.. కొత్త నియామకాల విషయంలో… ఏపీ సర్కార్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close