సమ్మర్‌ సినిమాల వార్‌లో మెగా హీరోలు ?

ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి సినిమాల పోటీ బాగా జరిగింది. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్‌, శర్వానంద్‌… ఇలా నలుగురు హీరోల సినిమాలు మూడు రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ అయి సంక్రాంతి సందడిని మరింత పెంచాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో దేనికీ డిజాస్టర్‌ టాక్‌ రాకపోవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. కలెక్షన్లపరంగా అందరూ సేఫ్‌ అయ్యారు. సంక్రాంతి సినిమాల పోటీ ఎలా వుంటుందో? ఏ సినిమాకి నష్టం జరుగుతోందోనని టెన్షన్‌ పడిన ట్రేడ్‌ వర్గాలు ఆయా సినిమాల రిజల్ట్‌ చూసి రిలాక్స్‌ అయ్యాయి.

ఇప్పుడు మరో పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే హీరోలు తమ రిలీజ్‌ డేట్స్‌ని ఎనౌన్స్‌ చేస్తూ సమ్మర్‌ని ఇప్పటి నుంచే వేడెక్కిస్తున్నారు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌ 8న రిలీజ్‌ చేసెయ్యాలని షూటింగ్‌ ఫాస్ట్‌గా చేసేస్తున్నాడు పవర్‌స్టార్‌. మరో పక్క అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ‘సరైనోడు’ చిత్రాన్ని కూడా సమ్మర్‌లోనే ఏప్రిల్‌ 7గానీ, 8న గానీ రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌గానీ, అల్లు అర్జున్‌గానీ ఈ రిలీజ్‌ డేట్‌ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారట. ఈ రెండు సినిమాలు కాక అదే నెలలో చాలా సినిమాలు రిలీజ్‌ అవబోతున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోల పోటీ మిగతా సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close