పరీక్షలపై అన్ని చోట్లా షాకులే..! ఏపీ సర్కార్‌కు ఏమీ అనిపించడం లేదా..?

ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ అభాసుపాలవుతున్నా… ముందుకే వెళ్తోంది. పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ సర్కార్ వేసిన అఫిడవిట్‌లోని లోపాలను సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. అసలు ఏ విషయం క్లారిటీగా చెప్పాలని మండిపడింది. జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని.. రోజు మార్చి రోజు నిర్వహిస్తామని.. రూములో పదిహేను మంది మాత్రమే విద్యార్థులు ఉంటారని ఏపీ సర్కార్ చెప్పుకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. రూముకు పదిహేను మంది విద్యార్థుల్నే పరీక్షకు అనుమతిస్తే.. 35వేల క్లాస్ రూములు కావాలని.. అన్ని సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించింది.

అసలు పరీక్షల తేదీలతో సహా వివరించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి క్లారిటీతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణ సందర్భంగా.. ఏ విద్యార్థి అయినా కరోనా కారణంగా చనిపోతే రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ప్రాణాలతో చెలగాటమేనని… మళ్లీ కరోనా తీవ్రత పెరిగితే మధ్యలో పరీక్షలు నిలిపివేయాల్సి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. విద్యార్థుల ఆరోగ్యానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ శుక్రవారం చేపట్టనుంది. మరో వైపు.. జులై 31 లోపు ఇంటర్​ఫలితాలు వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీం ఆదేశించింది.

10 రోజుల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పూర్తి చేయాలని సూచించిన ఏపీ సర్కార్ మొండిపట్టుదల ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశమవుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో నమోదైందని కేంద్రం ప్రకటించినా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తోందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి పరీక్షలపై సుప్రీంకోర్టు రేపు తేల్చేయనుంది. అదే క్లైమాక్స్ అనుకోవాలి. ప్రభుత్వం అన్ని వివరాలు సమర్పించి పరీక్షలు పెడతామని తేల్చినా.. తాజా ఆదేశాల ప్రకారం.. జూలై నెలాఖరు కల్లా.. ఫలితాలు ప్రకటించడం అసాధ్యమే. మరి ఏపీ సర్కార్ ఏం చేస్తుందో..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close