చంద్రబాబుకు సెక్యూరిటీ ముప్పు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రతాపరమైన ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయంలో అనుక్షణమూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్, విమానం తదితర వాహనాలను ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో సిఫార్సు చేశారు. విజయవాడలో ఆయన అధికార నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ కృష్ణానది ఒడ్డున ఉన్నందున నదిలో మరపడవలతో పోలీసులు 24 గంటలూ కాపలా కాసేవిధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ బోట్లలో గజ ఈతగాళ్ళు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు, స్విమ్మింగ్ నెట్ ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్ల దాడి జరిగిన నాటినుంచి ఆయనకు జడ్ కేటగరి సెక్యూరిటీ అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కృష్ణా కరకట్టపైనున్న లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఉంటుండటంతో ఆ కరకట్ట పొడవునా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో సీసీ కెమేరాలను అమర్చాలని పోలీసులు గతంలోనే నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close