రాజీనామాల వెనక సెంటిమెంట్ అర్థం చేసుకుంటారా..?

పార్టీ నిర్ణ‌యించిన‌ట్టుగా కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజీనామాలు చేశారు. రాజీనామా ప‌త్రాల‌ను ప్ర‌ధాన‌మంత్రికి అందించామ‌ని చెప్పారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… మంత్రులుగా దేశానికి సేవ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి త‌న‌వంతు స‌హాయం చేస్తాన‌ని ప్ర‌ధాని చెప్పార‌ని వివ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌లేంటో ప్ర‌ధాన‌మంత్రికి తెలుసున‌ని సుజనా చౌద‌రి అన్నారు. రాజీనామాలతో త‌మ‌కు మ‌రింత స్వేచ్ఛ వ‌స్తుంద‌ని చౌద‌రి చెప్పారు. ఎన్డీయేలో కొన‌సాగుతూనే హ‌క్కుల సాధనకు తీవ్రంగా ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న అంశాల‌ను అమ‌లు చేయ‌డానికి ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాలు అవ‌స‌రం లేద‌ని అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో రెండు జాతీయ పార్టీలూ ద్రోహం చేశాయ‌ని సుజ‌నా ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సెంటిమెంట్ ను కేంద్రం గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కే తాము రాజీనామాలు చేయాల్సి వ‌చ్చింది స్ప‌ష్టం చేశారు. కేంద్రం గ‌తంలో ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీని స‌క్ర‌మంగా అమ‌లు చేసి ఉంటే ఇప్పుడీ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌న్నారు. ఏదేమైనా, ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌నీ, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది పార్టీ అధినేత‌తో చ‌ర్చించాక వెల్ల‌డిస్తామ‌ని సుజ‌నా చెప్పారు. సో.. మ‌రో లాంఛ‌నం పూర్త‌యిన‌ట్టు లెక్క‌.

సెంటిమెంట్లతో రాజ‌కీయాలు చేస్తే కేటాయింపుల్లో మార్పులేవీ రావ‌ని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ సెంటిమెంటు ఎంత బ‌లంగా ఉంద‌నేది ఇప్ప‌టికైనా కేంద్రం అర్థం చేసుకుంటే మంచిది. ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్ తీవ్రత స్థాయి ఇద్ద‌రు కేంద్ర మంత్రుల రాజీనామా వ‌ర‌కూ ప‌రిస్థితిని తీసుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం నుంచి త‌ప్పుకున్న‌ది టీడీపీ మాత్ర‌మే కావొచ్చు. కానీ, క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేసే వరకూ ప‌రిస్థితి వ‌చ్చిందంటే అది ప్ర‌ధాన‌మంత్రి వైఫ‌ల్యాన్ని కూడా ఎత్తి చూపిన‌ట్టే లెక్క‌. ఈ రాజీనామాల‌ను టీడీపీ రాజ‌కీయ చ‌ర్య‌గా చూస్తారా, లేదా దీన్లో త‌మ బాధ్య‌తారాహిత్యం కూడా కొంత ఉంద‌ని ప్ర‌ధాని గ్ర‌హిస్తారా అనేది వారి విచ‌క్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అన్నిటికీ మించి, సెంటిమెంట్ ఎంత బ‌లంగా ఉంద‌నేది ఈ రాజీనామాల ద్వారా కేంద్రం కాస్తైనా అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close