కదిలించిన `ఆమె’ కథ

రెండురోజుల క్రిందట అమెరికాలో ఉంటున్న మిత్రుడొకడు నాకు మెయిల్ పంపాడు. అందులో `ఈ వార్త మీరు చదివారా? ఒకవేళ చదవకుంటే తప్పకుండా చదవి మీ అభిప్రాయాలు తెలియజేయండి’ – అంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ లోని ఒక వార్తకు సంబంధించిన లింక్ పంపాడు. అది చదివిన తర్వాత నా స్పందనగా ఈ వ్యాసం రాస్తున్నాను.

ప్రధాని మోదీ `అసహనం’ పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దేశంలో అసహనం పేరుకుపోయిందని అంటే చాలు, కొరకొరా చూస్తున్నారు. అలాగే, దేశంలో సమానత్వం బలహీనపడుతున్నదన్నా, కులమతపరమైన అంతరాలు పెరిగిపోతున్నాయని చెప్పినా, కట్టుబాట్ల పేరుతో గ్రామబహిష్కరణలు ఇంకా అమలవుతూనేఉన్నాయని మొరపెట్టుకుంటున్నా ఈ `పైచూపు’ ప్రధానమంత్రి పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఇవన్నీ ఆయన కంటికి ఆనడంలేదుకాబట్టి. ఇక ఎలక్ట్రానిక్ మీడియా (టివీ మీడియా) కూడా చాలామటుకు పాలకులు నడిచిన బాటలోనే సాగుతోంది. అయినప్పటికీ, మీడియాలో కొన్ని వాస్తవాలు అడపాదడపా వెలుగుచూస్తూనేఉన్నాయి. ముఖ్యంగా ప్రింట్ ,వెబ్, సోషల్ మీడియాల ద్వారా నిజం బయటకు వచ్చేస్తూనేఉంది. అలాంటి వార్తే ఇది. ఈ వార్తకు మోదీకి నేరుగా సంబంధం ఉండకపోవచ్చు, కానీ దేశంలో ఒక్క అసహనమేకాదు, అస్పృశ్యత, కులాల మతాల అంతరాలు, మూఢనమ్మకాలు మనల్ని శతాబ్దాల వెనక్కి తీసుకుపోతోంది. దేశాన్ని అభివృద్ధిచెందిన దేశాల సరసన నిలబెట్టాలని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఇవి వెక్కిరిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలపై మోదీ తక్షణం స్పందించాల్సిందే.

ఆమె కథ

అది కర్నాటకలోని కోలార్ జిల్లాలోఉన్న కగ్గణహళ్లి గ్రామం. కర్నాటకలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకోసం మధ్యాహ్న భోజన పథకం అమల్లోఉంది. రోజు ఎంతమంది పిల్లలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్న వివరాలు నెలవారీగా ప్రభుత్వానికి చేరుతాయి. వాటి ఆధారంగానే పథకం అమలుతీరుతెన్నులను అధికారులు సమీక్షిస్తుంటారు. అయితే, కగ్గణహళ్లి గ్రామంలో గత ఐదునెలలుగా ప్రతిరోజూ `ఎవ్వరూ తినలేద’న్న రిపోర్ట్ కనబడుతోంది. ఆ పాఠశాలలో వంటచేస్తున్న రాధమ్మ తన విధుల్లో భాగంగా డైరీలో ఈమాటల్నే రోజూ రాయాల్సి వస్తున్నది. డిక్టేషన్ లాగా…

ఎందుకని పిల్లలు ఈ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకోవడంలేదని ఆరాతీస్తే చాలా విషయాలు తెలిశాయి. అవి…

1. రాధమ్మ అనే ఈ వంటమనిషి షెడ్యూల్ కులానికి చెందినది కావడం.

2. ఆ విషయం ఈ ప్రాధమికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కి తెలుసు. నువ్వేమీ పిల్లలకు భోజనం వండాల్సిన పనేమీలేదన్న కండిషన్ మీదనే ప్రస్తుతం ఆమెని ఈ ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు. నెలకు 17వందల జీతం ఇస్తున్నారు. ఆమె `ఆది కర్నాటక’ కులానికి చెందినది. ఏడుగురు కుటుంబ సభ్యులను ఆమెపోషిస్తున్నది. కగ్గణహళ్లిలో 101 కుటుంబాలున్నాయి. మొత్తం జనాభా 452. నలభైశాతం మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి చెందినవారు కాగా, 18.14 శాతం మంది రాధమ్మ కులంవారే.

3. ఈ స్కూల్లో విద్యార్థులు గతఏడాది ఆరంభంలో చాలామందే (118) ఉండేవారు. ఇక్కడ ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతివరకూ బోధిస్తుంటారు. రాధమ్మను గతఏడాది ఫిబ్రవరిలో పనిలోకి చేర్చుకున్నారు. వెంటనే జూన్ నాటికి వందమంది పిల్లలు ఆ స్కూల్ విడిచివెళ్ళిపోయారు. అంటే కేవలం 18 మంది మాత్రమే మిగిలారు. వారుమాత్రం ఎందుకు ఉన్నారంటే, వారి తల్లిదండ్రులు పెట్టిన షరతును హెడ్ మాస్టర్ ఒప్పుకోవడంవల్ల. వంటమనిషి రాధమ్మ ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం వండివడ్డించకూడదన్నదే ఈ షరతు. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ స్కూల్లో అమలుచేయడం కష్టమని, అందుకే ఆపేయాలని అనుకుంటున్నామని విద్యాశాఖాధికారి చెబుతున్నారు. స్కూల్ లో విద్యార్థుల సంఖ్య పదికంటే తక్కువ ఉంటే ఆ స్కూల్ ని మూసేయవచ్చు. మధ్యాహ్న భోజనం వ్యవహారంతో అసలు స్కూలే మూతపడే పరిస్థితి ఎదురవబోతోంది.

4. స్కూల్లో 58మంది ఉన్నప్పుడు తాను వండిపెడితే పిల్లలు తిన్నారని రాధమ్మ అంటున్నది. విద్యాసంవత్సరం ముగియగానే వీరిలో 51మందిని వేరేచోట్ల చేర్చారు. మిగతా ఏడుగురు కూడా తర్వాత స్కూల్ మారారు. ఉన్నతకులాలకు చెందిన తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనే రాధమ్మ వంటని, చివరకు దళితవర్గాలకు చెందిన పిల్లలు కూడా తినడం మానేశారు. దళితవర్గానికి చెందిన వంటమనిషిగా చేసిన వంటలను తమ పిల్లలు తినరని అగ్రవర్ణాలకు చెందినతల్లిదండ్రులు బాహాటంగానే చెబుతున్నారు. వారుచేసే కట్టడితో మిగతావాళ్లూ అదేదారిన పోతున్నారు. మొత్తంగా ఒకప్పుడు తాలూకాలోనే మంచి నెంబర్ వన్ గా పేరుబడ్డ ఈ స్కూల్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.

5. మరో విషయం ఏమంటే, రాధమ్మ కుటుంబంతోసహా, నాలుగు కుటుంబాలను సామాజికంగా బహిష్కరించారు. గ్రామస్థులు ఈ కుటుంబాలవారిపై కట్టుబాట్లు పెట్టారు. మంచినీళ్లు వంటి అవసరాలు తీర్చడంలేదు. కట్టుబాట్లకు విరుద్ధంగా ఏవరైనా సాయంచేస్తే 501 రూపాయల జరిమానా కూడా విధిస్తామని ప్రకటించడంతో ఎవరికివారు ఈ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైంది. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అయినా గ్రామంలో సామాజిక కట్టుబాటు అలాగే ఉంది.

6. ఇంతకీ, ఈ నాలుగు దళిత కుటుంబాలు చేసిన తప్పేమిటి ? సంక్రాంతి సంబరాలప్పుడు ఉన్నతవర్గాలకు కేటాయించబడిన స్థలంలోనే వేడుకలు జరుపుకోవడమే వీరుచేసిన తప్పు. దీనికితోడు, పాఠశాలలో హెడ్ కుక్ పోస్ట్ కు రాధమ్మ దరఖాస్తు చేసుకోవడమన్నది పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించింది,

పట్టణాల్లో పట్టింపులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, గ్రామాల్లో మాత్రం కుల,మత పట్టింపులు ఇప్పటికీ దారుణంగానే ఉన్నాయి. వివాహం, లేదా ఏదైనా వేడుకలకు భోజనాలు ఏర్పాటుచేస్తే, `వంట ఎవరు చేస్తున్నారు?’ అని అడిగి వివరాలు తెలుసుకుని, సంతృప్తి చెందిన పిమ్మటే విందుకు హాజరవడం జరుగుతోంది. మొన్నీమధ్యనే నేను మాసొంతూర్లో ఒక ఫంక్షన్ పెట్టుకుని భోజనాలకు పిలిస్తే, పిలుపుఅందుకున్న వెంటనే `వంట ఎవరు చేస్తున్నారు?’ అన్న ప్రశ్నని ఎదుర్కోవాల్సివచ్చింది. అంతేకాదు నా సమాధానానికి సంతృప్తి చెందక నా ముందే ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసినవారూ ఉన్నారు. అలా ప్రశ్నిస్తున్నవారే, నగరాలకు వచ్చినప్పుడు ఏ ఫంక్షన్ హాలో లేదా హోటల్లోనో భోజనాలు చేసేటప్పుడు వంట ఎవరు చేశారని అడగడం చాలా అరుదుగా కనిపిస్తోంది. స్థానికంగా ఉన్నప్పుడు మాత్రం డాంభికాలు ప్రదర్శిస్తుంటారు. నరనరాల్లో జీర్ణించుకున్న అసమానత్వ భావన కొందరిదైతే తెచ్చిపెట్టుకునే డాంభిక తత్వం మరి కొందరిది. కులమతాల జాఢ్యం వెంటాడుతున్నంతవరకు సమభావమన్నది ఎండమావి మాత్రమే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close