డెడ్‌లైన్ ఓవర్..! సోషల్ మీడియా సేఫ్..!

సోషల్ మీడియా సంస్థలు కొత్త రూల్స్ అమలుచేయడానికి కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగిసింది. చివరి క్షణం వరకూ అమలుచేయాలా వద్దా అని ఆలోచించిన దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు… చివరికి తమ అంగీకారాన్ని తెలిపాయి. ఒక్క ట్విట్టర్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్రం ప్రకటించిన డెడ్‌లైన్ మేరకు.. నిబంధనలు అమలు చేసేందుకు తాము సిద్ధమని ఫేస్‌బుక్, గూగుల్ అధికారికంగా ప్రకటించాయి. అదే సమయంలో ట్విట్టర్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ట్విట్టర్‌తోనే కేంద్రం లడాయి పెట్టుకుంది. బీజేపీ నేతలు చేస్తున్న ట్వీట్లకు మ్యానిపులెటెడ్ మీడియా అనే ట్యాగ్ పెడుతూండటంతో వారి ఆఫీసుల్లో పోలీసులతో సోదాలు కూడా నిర్వహింప చేసింది.

కొంత కాలంగా ముఖ్యంగా రైతుల ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కేంద్రానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీంతో కట్టడి చేయాలనుకున్న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 .. గైడ్ లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు సహా ఓటీటీ వేదికలైన యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్ తదితర ఓటీటీలు స్వీయ ఐటీ-2021 మార్గ నిర్దేశకాలను విధిగా పాటించాలి.

ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఖ‌చ్చితంగా భార‌త్‌లో వారి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేయాలి.. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే అధికారులు కూడా దేశంలోనే ఉండాలి. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. అసభ్య, అసత్య పోస్టులు ఎవరు పెడుతున్నారో గుర్తించే బాధ్యత ఆయా సంస్థలదేనని.. అలాగే ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని రూల్స్ పెట్టారు. వీటిని అమలు చేయకపోతే.. దేశంలో సోషల్ మీడియా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. మిగిలిన అన్నీ అంగీకరించాయి కానీ.. ట్విట్టర్ విషయంలో కేంద్రం ఏం చేస్తుందనేదానిపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close