జ‌న‌తా గ్యారేజీలో.. ఆయ‌న మ‌హా కాస్ట్లీ

ప‌ర‌భాషా న‌టులంటే మ‌న‌వాళ్ల‌కు ఎంత ప్రేమో?! వాళ్లు అడిగినంత పారితోషికం పువ్వుల్లో పెట్టి మ‌రీ ఇస్తారు. లొకేష‌న్లో వాళ్ల‌కు సూప‌ర్ స్టార్ లెవిల్ ట్రీట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజీ సెట్లో మోహ‌న్‌లాల్ రాజ‌వైభోగం ఇదీ. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం… జ‌న‌తా గ్యారేజ్‌. ఇందులో ఎన్టీఆర్ పెద‌నాన్న‌గా మోహ‌న్‌లాల్ క‌నిపించ‌నున్నారు. ఎన్టీఆర్ త‌ర‌వాత అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్ర అదే. మోహ‌న్‌లాల్ రాక‌తో మ‌ల‌యాళంలో ఈ సినిమా రేంజ్ పెరుగుతుంద‌ని చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అందుకే.. మోహ‌న్‌లాల్‌కు భారీ పారితోషికం ఇచ్చార‌ట‌.

ఈ సినిమాకోసం మోహ‌న్‌లాల్ అందుకొన్న పారితోషికం అక్ష‌రాలా రూ.మూడున్న‌ర కోట్లు అని తెలుస్తోంది. ఎన్టీఆర్‌, కొర‌టాల త‌ర‌వాత అంత‌టి పారితోషికం అందుకొన్న‌ది ఆయ‌నే. మూడున్న‌ర కోట్ల కోసం న‌లభై రోజుల కాల్షీట్లు ఇచ్చార‌ట‌. ఈ న‌ల‌భై రోజులూ ఆయ‌న‌కు 5స్టార్ ఫెసిలిటీస్ క‌ల్పిస్తున్నార‌ట‌. లెక్క ప్ర‌కారం చూస్తే.. ఆ సౌక‌ర్యాల‌కు క‌నీసం అద‌నంగా మ‌రో పాతిక ల‌క్ష‌ల వ‌ర‌రూ ఖ‌ర్చ‌వ్వ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నారు. మరి ఇంత కాస్ట్లీ న‌టుడి వ‌ల్ల జ‌న‌తా గ్యారేజీ రేంజ్ ఏమాత్రం పెరుగుతోందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

బీజేపీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్సే !

ఎన్నికల ఫలితల తర్వాత బీఆర్ఎస్ ఉండదని కిషన్ రెడ్డి మాత్రమే కాదు బండి సంజయ్ సహా బీజేపీ నేతలందరూ చెబుతున్నారు. వారు ఈ మాటల్ని ఆషామాషీగా అనడం లేదు. అందుకే...

ఎన్నికలు ముగిసిన రేవంత్‌ ముందరి కాళ్లకు బంధమే !

లోక్ సభ ఎ్నికల పోలింగ్ ముగిసింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్న రేవంత్ కు ఈసీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కనీసం కేబినెట్ సమావేశాన్ని కూడా స్వేచ్చగా ఏర్పాటు చేసుకునే అవకాశం...

ఓటును రూ. 5వేలకు అమ్ముకున్న మంగళగిరి ఎస్‌ఐ

మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో.. వైసీపీ లీడర్‌కు కొమ్ము కాసినందుకో కాదు.. తన ఓటును ఐదు వేలకు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close