సునీల్‌కి మంచి క్యారెక్ట‌ర్ ప‌డిపోయింది

హీరోగా వ‌రుస ప‌రాజ‌యాల్ని చ‌వి చూస్తున్నాడు సునీల్‌. `హీరోయిజం వ‌దిలేసి హాయిగా క‌మెడియ‌న్‌గా సినిమాలు చేసుకోవ‌చ్చు క‌దా` అనే స‌ల‌హాలూ ఎక్కువయ్యాయి. సునీల్ కూడా అలాంటి మంచి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోయిజం రుచి మ‌రిగి మ‌ళ్లీ కామెడీ వైపు మ‌ళ్ల‌డం క‌ష్ట‌మే. మంచి బ్యాన‌ర్‌, మంచి ద‌ర్శ‌కుడు, స్టార్ హీరో సినిమా అయితే క‌ళ్లు మూసుకుని చేసేయొచ్చు. ఆ అవ‌కాశం ఖైది నెం.150 తో వ‌చ్చింది కూడా. కానీ కాల్షీట్ల స‌మ‌స్య‌తో ఆ సినిమా వ‌దులుకోవాల్సివ‌చ్చింది. అయితే ఇప్పుడు `సైరా`కి మాత్రం సై అన్నాడు. ఆ సినిమాలో సునీల్ పాత్రేమిటో తెలీదు గానీ.. ఇప్పుడు మ‌రో సినిమాలో ఓ సూప‌ర్ క్యారెక్ట‌ర్ ప‌ట్టేశాడు సునీల్‌.

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఇందులో సునీల్‌కి ఓ మంచి క్యారెక్ట‌ర్ దొరికింద‌ని టాక్‌. హీరో త‌ర‌వాత‌… అంత‌టి కీల‌క‌మైన పాత్ర‌లో సునీల్ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. సునీల్ – త్రివిక్ర‌మ్‌ల మైత్రి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది? సునీల్ స్టార్ క‌మెడియ‌న్‌గా మారాడంటే దానికి స‌గం కార‌ణం త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగులే. ఇప్పుడు మ‌రోసారి సునీల్ కోసం సూప‌ర్ కామిక్ రోల్ డిజైన్ చేశాడ‌ని స‌మాచారం. సునీల్ కూడా హీరో నుంచి మ‌ళ్లీ కామెడీ పాత్ర‌ల వైపు యూట‌ర్న్ తీసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close