సారీ… సుశాంత్ బాబూ…

హిట్టు కోసం వీర‌లెవిల్లో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు సుశాంత్‌. క‌రెంట్‌, అడ్డా సినిమాలు ఫ‌ట్టుమ‌న‌డంతో త‌దుప‌రి సినిమాకోసం చాలా టైమ్ తీసుకొన్న సుశాంత్ ఇప్పుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఆటాడుకొందాం రా సినిమా చేశాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. కానీ.. విడుద‌లకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తోందీ చిత్ర‌బృందం. మెల్లిమెల్లిగా పబ్లిసిటీ కూడా మొద‌లెట్టేసింది. అందులో భాగంగానే ఈ రోజు సుశాంత్ లుక్‌ని కూడా విడుద‌ల చేశారు. ఫ్రెంచ్ గ‌డ్డంతో సుశాంత్ బాబు డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నా.. అదెందుకో సుశాంత్‌కి సూట్ కాలేదు. ఇది వ‌ర‌కే ఈ బాబు బాగున్నాడు.. అనిపించేలా ఉంది లుక్‌. ఇలాంటి లుక్‌ల్ని బ‌య‌ట‌పెట్టేముందు సుశాంత్‌తో పాటు, ద‌ర్శ‌క నిర్మాత‌లూ కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. సినిమా చూడాల‌న్న ఆ కాస్తంత ఆశ‌నీ… సుశాంత్ ఏదో ఓ రూపంలో చంపేయాల‌నుకొంటే ఎలా?? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వెనుక అన్న‌పూర్ణ స్టూడియోస్‌, నాగార్జున లాంటి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, కేవ‌లం సుశాంత్ కోస‌మే సినిమాలు తీసే నిర్మాత (చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు) ఉన్నా… సుశాంత్ వ‌రుస‌గా సినిమాలు తీయ‌లేక‌పోతున్నాడు, తీసినా హిట్టు కొట్ట‌లేక‌పోతున్నాడు. ఇలాంటి ద‌శ‌లో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. ఎనీవే.. లుక్ ఎలాగున్నా సినిమా మాత్రం బాగుండాల‌ని కోరుకొందాం. అన్న‌ట్టు ఆగ‌స్టు 19న ఈచిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close