మనీ..మనీ..మోర్ మనీ..! చంద్రబాబు స్కెచ్ ఓట్లు తెచ్చి పెడుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు.. ఒక్కొక్కరికి రూ. నాలుగు వేలు పసుపు – కుంకుమ నిధులు అందాయి. వారి అకౌంట్లలో శనివారమే నగదు జమ చేసింది. వారంతా… ఇవాళ నుంచి..బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న బ్యాంకు శాఖల వద్ద.. ముఖ్యంగా.. పొదుపు మహిళా గ్రూపుల ఖాతాలు ఉన్న బ్యాంకుల వద్ద మహిళల క్యూలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఇప్పటికే.. పసుపు – కుంకుమ కింద… రెండు విడతలుగా ఆరువేలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. మూడో విడతగా నాలుగు వేలు మంజూరు చేసింది. ఈ పథకాన్ని… ప్రతీ ఏటా కొనసాగిస్తామని.. ఏడాదికి పది వేలు.. డ్వాక్రా మహిళలకు.. ఇస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు. నగదు సాయం పొందుతున్న మహిళల ఆనందం.. టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. అధికారం ఇస్తే.. ప్రతిపక్ష పార్టీ సాయం చేస్తామంటోంది.. కానీ ఇప్పటికే ఏపీ సర్కార్ సాయం చేయడం ప్రారంభించింది. డబ్బులు తీసుకున్నవారిలో… ప్రభుత్వంపై కృతజ్ఞతాభావం ఉంటుందని.. కచ్చితంగా తమకే ఓటు వేస్తారని.. టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. పసుపు-కుంకుమ అందుకున్న మహిళల స్పందన కూడా అలాగే ఉంది.

హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో.. పోలీసులు రూ. 8కోట్ల రూపాయలను పట్టుకున్నారు. ఇదేదో హవాలా వ్యాపారుల సొమ్ము అనుకుంటే.. పెద్దగా విశేషం అయ్యేది కాదు.. ఎన్నికల సమయంలో.. ఇలాంటి కోటానుకోట్లు పట్టుబడుతూంటాయి. కానీ.. అసలు విశేషం.. ఈ మొత్తం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ … ఇచ్చిన చెక్కు ద్వారా.. కొంత మంది బీజేపీ సానుభూతి పరులు డ్రా చేసిన సొమ్ము. ప్రతిబంధకాలను అధిగమించి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేసింది. ఒక వైపు ఉన్నతాధికారులు, మరోవైపు వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ, కమిషన్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. 3 వేల 900 కోట్ల రూపాయల నిధులను నాలుగో విడత రుణమాఫీ కోసం విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన ప్రభుత్వం 50 వేల రూపాయలలోపు రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేసింది. లక్షన్నరలోపు ఉన్న రుణాలను ఐదు విడతలుగా, ఐదేళ్లల్లో మాఫీ చేస్తామని, ఇందుకయ్యే వడ్డీని కూడా తామే చెల్లిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగో విడత కింద వడ్డీతో కలుపుకొని 3 వేల 900 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరో వైపు పెన్షన్లను.. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ లోపు పంపిణీ చేశారు. వృద్ధులకు… ఇది గత మూడు నెలల కాలంలో… ఏడు వేలు అందాయి. ఒకప్పుడు రూ. రెండు వందలు ఉన్న పెన్షన్.. ఇప్పుడు వేలల్లో కళ్ల జూస్తూండటంతో.. వారితో కృతజ్ఞతాభావం ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close