జగ్గారెడ్డికి కేసీఆర్ ప్రసన్నం అయ్యారా ?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సంగారెడ్డి వరకూ మెట్రోను పొడిగించాలని విజ్ఞప్తి చేసేందుకు… సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై విజ్ఞాపనులు చేసేందుకు సీఎంను కలిశానని.. జగ్గారెడ్డి చెబుతున్నారు. తానేమీ చీకట్లో కేసీఆర్ ను కలవలేదని చెబుతున్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పు లేనిది ఎమ్మెల్యేగా తాను సీఎంను కలిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తున్నారు.

ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అమిత్ షా, మోదీలతో పలుమార్లు సమావేశం అయ్యారు. అది తప్పు కానీ సీఎంగా ఉన్న కేసీఆర్ కలవడం తప్పేమిటన్న లాజిక్ ను ఆయన వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకునేందుకే ప్రధానిని కలిశారన్న గుసగుసలున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే.. సంగారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారిపోవచ్చన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

జగ్గారెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది టీఆర్ఎస్ పార్టీ నుంచే. తర్వాత ఆయన పార్టీతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ టైంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఓ సారి బీజేపీలో చేరినా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. కాంగ్రెస్‌లో ఆయన ఇమడలేకపోతున్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనను ఆహ్వానించే పార్టీ లేదు. బీజేపీలో చేరలేరు. బీఆర్ఎస్‌లో చేరేందుకు స్థానిక నేతలు అడ్డం పడతారు. ఇలాంటి పరిణామాలతో జగ్గారెడ్డికి పార్టీ మారే చాన్స్ లేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కేసీఆర్‌తో సమావేశం కావడం.. అందులో తప్పేముందని సమర్థించుకోవడంతో ఆయనపై మరోసారి పార్టీ మార్పు చర్చలు ప్రారంభమయ్యయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close