ఆ విష‌యంలో చంద్రుల చొర‌వేదీ..?

ఏదైనా ఒక స‌మ‌స్య‌పై క‌మిటీ ఎందుకు వేస్తారు..? ఆ క‌మిటీలో అనుభ‌వం ఉన్న నాయ‌కుల్ని స‌భ్యులుగా ఎందుకు నియ‌మిస్తారు..? ఆ ప‌ర్టిక్యుల‌ర్ స‌మ‌స్య‌పై వీలైనంత త్వ‌ర‌గా… వీలైనంత లోతుగా అధ్య‌య‌నం చేసి, ఆమోద యోగ్య‌మైన ప‌రిష్కారం చూపిస్తార‌నే క‌దా! కానీ, తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న చిక్కుముళ్ల‌ను విప్పేందుకు ఏర్పాటైన క‌మిటీ ప‌నితీరు మాత్రం ఈ స్ఫూర్తికి భిన్నంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తమౌతోంది.

ఉమ్మ‌డి ఆంధ్రా విభ‌జ‌న జరిగిన ఒక్కో సంవ‌త్స‌ర‌మూ గ‌డిచిపోతూ ఉన్నా… తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన పంప‌కాలు చాలానే ఉన్నాయి. ఈ పంచాయితీలు ఎప్ప‌టిక‌ప్పుడు తెర‌మీదికి రావ‌డం, ఇరు రాష్ట్రాల మంత్రులూ ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం చూస్తూనే వ‌చ్చాం. ఇక‌, తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో గ‌వ‌ర్న‌ర్ చొర‌వ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏదైతేనేం, ఎట్ట‌కేల‌కు ఒక త్రిస‌భ్య క‌మిటీ ఈ స‌మ‌స్య‌ల పరిష్కారానికి రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఇంకేముంది, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పంప‌కాలు, సంస్థ‌ల విభ‌జ‌న అన్నీ చ‌క‌చ‌కా అయిపోతాయ‌నుకున్నాం. కానీ, ఈ క‌మిటీ కేవ‌లం భేటీల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌, ఆంధ్రా త‌ర‌ఫున ఏర్పాటైన త్రిస‌భ్య క‌మిటీలు కేవ‌లం స‌మావేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌డ‌మే మిగులుతోంది. విభ‌జ‌న చిక్కుముళ్ల‌ను విప్ప‌డం కంటే… స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌తో కాల‌యాప‌నకే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టుంది. స‌మావేశాలు అయితే బాగానే జ‌రుగుతున్నాయి. కానీ, స‌మ‌స్య‌లే.. ఎక్క‌డివి అక్క‌డే ఉంటున్నాయి. ఆంధ్రా తెలంగాణ మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇరు రాష్ట్రాలూ చొర‌వ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, టైం వేస్ట్ కార్య‌క్ర‌మాలు త‌గ్గించాల‌ని తాజాగా గ‌వ‌ర్న‌ర్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు.

విచిత్రం ఏంటంటే… క‌మిటీకి బాధ్య‌త‌లు అప్ప‌గించేసి, ముఖ్యమంత్రులిద్ద‌రూ చేతులు దులిపేసుకుని కూర్చున్న‌ట్టున్నారు! ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుగానీ, కేసీఆర్ గానీ ప్ర‌ధానంగా ఎదుర్కోవాల్సిన విమ‌ర్శ ఏంటంటే… ఓటుకు నోటు లాంటి కేసు గురించి అయితే ఇద్ద‌రు చంద్రులూ ఆఘ‌మేఘాల మీద చ‌ర్చించేసుకుంటారు. జ‌ఠిలం అనుకున్న ఆ స‌మ‌స్య‌కు పరిష్కారం క‌నిపెట్టేశారు. అదే స్థాయి చొర‌వ ఇత‌ర అంశాల‌పై చూపించి ఉంటే ఈ విభ‌జన స‌మ‌స్య‌లు ఎప్పుడో ప‌రిష్కృతం అయ్యేవి క‌దా! తాజాగా స‌మావేశ‌మైన త్రిస‌భ్య క‌మిటీ భేటీలో స‌మ‌స్య‌ల సాధ‌న దిశ‌గా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. ఇంకా తాత్సారం చేస్తూ పోతూ చంద్ర‌బాబు, కేసీఆర్ కూడా మ‌రిన్ని విమర్శ‌లు ఎదుర్కొనాల్సి వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో 12 గంటలపాటు వైన్స్ షాపులు మూసివేయలంటూ ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం...

బెంగ‌ళూరు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం

ఈ ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభంలో వ‌రుస ఓట‌ముల‌తో నిరుత్సాహ‌ప‌రిచిన బెంగ‌ళూరు, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకొంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఆదివారం దిల్లీపై 47 ప‌రుగుల తేడాతో...

ఇన్ని ఫేకులా ? – కాడి దించేసిన వైసీపీ !

ప్రచారం ముగిసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఓవర్ టైం వర్క్ చేసింది. చంద్రబాబు ఫేక్ వీడియోలు పెట్టుకుని గంటకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ పోయింది. ఓ సారి రిజర్వేషన్ల మీద..మరోసారి పథకాల...

మీడియా వాచ్ : టీవీ9 మహాపతనం

ఒళ్లు అమ్ముకునేవాళ్లైనా కొన్ని రూల్స్ పెట్టుకుంటారేమో కానీ.. టీవీ9కి మాత్రం ఎలాంటి నైతిక విలువలు .. మీడియా రూల్స్ పెట్టుకోలేదు. నిర్భయంగా ఫేక్‌ వార్తలు ప్రసారం చేసేసింది. చంద్రబాబు వాయిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close