చైతన్య : తిరుమలను అపవిత్రం చేస్తోంది నటులు కాదు .. మీడియా, రాజకీయ నాయకులే !

ఏదైనా చూసే కళ్లలోనే ఉంటుందంటారు. సినీ సెలబ్రిటీలను.. వారు చేసే పనులను మీడియా బూతు కోణంలోనే చూస్తోంది. చిన్న హగ్ ఇచ్చినా హవ్వ ఇలా చేస్తారా.. అది బూతు పని అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ఆప్యాయంగా చేసుకునే హగ్‌కు.,. కామంతో చేసుకునే కౌగిలింతకూ తేడా లేకుండా.. వారు చేసే పనుల్ని తప్పు పట్టడమే లక్ష్యంగా తెలుగు మీడియా చెలరేగిపోతోంది. దానికి తాజా సాక్ష్యం.. తిరుమల కొండ మీద కృతి సనన్, ఓంరౌత్, కౌగలించుకుని ముద్దులు పెట్టుకున్నారని.. అపచారం చేశారని ప్రచారం చేయడమే కాదు.. ఇలాంటివి కనిపిస్తే చాలు ఎగేసుకుని పది మందిని తీసుకుని వచ్చే చోటా నేతలతో తిట్టించడం కూడా చేశారు.

కృతి సనన్, ఓంరౌత్ హగ్ చేసుకున్నారని అపచారం అంటూ రెచ్చిపోయిన మీడియా

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక కోసం .. సినీ యూనిట్ అంతా తిరుపతి వచ్చింది. ముందు రోజే ప్రభాస్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓంరౌత్ దర్శనం చేసుకున్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కృతి సనన్ తన కారులో వెళ్లిపోయే సమయంలో ఓ హగ్ ఇచ్చారు ఓం రౌత్. బాలీవుడ్ లో ఇలాంటి హగ్ అత్యంత సామాన్యం .. అని ఎవరికైనా తెలుసు. ఆప్యాయంగా శరీరాలు తాకకుండానే ఇలా హగ్ చేసుకుంటారు. అందులో అశ్లీలం చూడటమే దౌర్భాగ్యం. మన మీడియా చూసింది. ముద్దులు పెట్టేసుకున్నారని రచ్చ ప్రారంభించేసింది. ఇంకేం పని లేనట్లుగా .. అసలు కొండ మీద అపరాచారాలేమిటని కొంత మంది బయలుదేరారు.

సినిమా వాళ్లంతా లేకిగా ప్రవర్తిస్తారని ఎందుకు నిందలేస్తున్నారు ?

కామంతో నిండిపోయిన కళ్లు లేకపోతే.. వివాదాలు చేసుకుందామని వేచి చూసే కెమెరా లెన్స్‌ల నుంచి కాకుండా.. సినిమా వాళ్లను కూడా కాస్త మనషులుగా.. వాళ్లకూ క్యారెక్టర్ ఉంటందన్న కోణంలో చూస్తే.. ఇలా అభాండాలు వేయరు. కృతి సనన్ అయినా .. ఓం రౌత్ అయినా.. తమ కామాన్ని ప్రదర్శించుకోవడానికి ఇలాంటి చేష్టలు చేయరు. అందులో కామం చూడటమే భయంకరమైన మానసిక వైకల్యం . ఆ వైకల్యంతో తెలుగు మీడియా బాధపడిపోతోందని స్పష్టమవుతోంది.

తప్పు చేయకపోయినా నయనతార, విష్నేష్‌లతో క్షమాపణ చెప్పించారు !

కొద్ది రోజుల కిందట.. నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకుని గుడికి వచ్చారు. గుడి ముందు ఫోటోలు దిగారు. అక్కడ ఫోటోలు దిగడానికి అనుమతి లేదని రచ్చ చేశారు. అంత అనుమతి లేకపోతే మీడియా కెమెరాలు అక్కడే ఎందుకు ఉంటాయి… వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర మైకులు పెట్టేది కూడా అక్కడే. వారు సెలబ్రిటీలు. తమ పెళ్లిని మెమెరబుల్ గా ఉంచుకోవడానికి ఫోటోలు తీసుకున్నారు. అందురూ చేసే పనే . అయినా వారిని వెంటాడి క్షమాపణలు చెప్పించుకుని ఇంకో సారి శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించారు.

అసలు తిరుమల కొండ మీద అపచారం చేస్తోందంతా రాజకీయ నేతలే- ప్రశ్నించే దమ్ముందా ?

తిరుమలకు సెలబ్రిటీలు భక్తితోనే వస్తారు. రాజకీయ నాయకులు వారానికోసారి వచ్చి మీడియాతో దారుణమైన మాటలు మాట్లాడుతూంటారు. వారిని ప్రశ్నించలేని మీడియా.. భక్తితో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన వారిపై.. చెప్పులేసుకుకున్నారు.. ముద్దులు పెట్టుకున్నారు.. హగ్ చేసుకున్నారంటూ… గోల చేయడం.. మీడియా మానసిక వైకల్యానికి నిదర్శనం. కామం కళ్ల నుంచి ముఖ్యంగా సినిమా వాళ్లను చూడటం మానేసి వారినీ మనుషులుగా చూస్తే. ఈ రోగం తగ్గిపోతుంది. తెలుగు మీడియాకు ఈ రోగం ఎప్పుడు తగ్గుతుందో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close