సమ్మర్ సినిమాల సంగతేంటి ?

టాలీవుడ్ క్యాలెండర్ లో రెండు నెలలు గడిచిపోయినట్లే. ఈ రెండు నెల్లల్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా ‘హనుమాన్’ ఒక్కటే. ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం అనుకున్న విజయాన్ని అందివ్వలేకపోయింది. మిగతా సంక్రాంతి సినిమాలు నా సామిరంగా, సైంధవ్ కూడా పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఫిబ్రవరి కూడా చప్పగానే వుంది. దీంతో పరిశ్రమ సమ్మర్ సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది.

అయితే సమ్మర్ సినిమాలు మూడు సవాళ్ళు వున్నాయి. ఈ సమ్మర్ ఎలక్షన్ సీజన్. ఇప్పటికే ఎన్నికల వేడిరాజుకుంది. సీట్ల పంపంకంతో ఎలక్షన్ ఫీవర్ పెరిగింది. ప్రస్తుతం జనాలు పొలిటికల్ మూడ్ లో వున్నారు. మరోపక్కా ఐపీయల్ సిద్దమౌతోంది. ఏడాదిలో ఇదొక బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. ఈ దాడి కూడా రంజుగా ఉండబోతుంది. ఐపీయల్ మొదలయ్యాక చాలా మంది మరో వినోదం జోలికి వెళ్లరు. పైగా వీకెండ్స్ లో రెండేసి మ్యాచుల చొప్పున అలరిస్తాయి. మరో సవాల్ పరీక్షలు. సమ్మర్ ఎగ్జామ్ టైం. రకరకాల ఎంట్రన్స్ టెస్ట్ లు కూడా ఈ సీజన్ లో వుంటాయి. ఈ రకంగా ఈ ఏడాది సమ్మర్ సినీ వినోదాలు మూడు సవాళ్ళు ఎదురుగా వున్నాయి.

బహుసా దీని కారణంగా సమ్మర్ లో విడుదల ఆనుకున్న చాలా సినిమాలు వాయిదాల వైపు చుస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర వెనక్కి వెళిపోయింది. ఏప్రిల్ లో రావాల్సిన ఈ సినిమాని దసరాకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఏప్రిల్ లిస్టు లో విజయదేవర ఫ్యామిలీ స్టార్ ఒక్కటే ప్రామెసింగ్ సినిమాగా కనిపిస్తుంది. మే 9న ప్రభాస్ కల్కి అంటున్నారు కానీ ఇంకా పక్కా కాలేదు. మొత్తానికి చాలా ఆశలుపెట్టుకున్న సమ్మర్ ఈఏడాది పెద్ద సందడి లేకుండానే ముగిసిపోనుందనే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close