జ‌న‌సేన‌కు చిత్ర‌సీమ ‘సైలెంట్‌’ స‌పోర్ట్‌!

గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన భారీ ఓట‌మి మూట‌గ‌ట్టుకొంది. సాక్షాత్తూ ప‌వ‌న్ క‌ల్యాణే రెండు చోట్లా ఓడిపోయారు. అయితే జ‌న‌సేన‌కు 6 శాతం ఓటు బ్యాంకు ఉంది. అది ఈసారి ఎన్నిక‌ల్లో గ‌న‌ణీయంగా పెర‌గ‌బోతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, కూట‌మిలో భాగ‌స్వామిగా చేర‌డం, ప‌వ‌న్ రాజ‌కీయ ఆలోచ‌న‌ల్లో ప‌రిణితి రావ‌డం వ‌ల్ల – ఈసారి ఫ‌లితాలు జ‌న‌సేన‌ను ఉత్సాహ‌ప‌రిచేలా ఉంటాయ‌ని భావిస్తున్నారు.

చిత్ర‌సీమ నుంచి కూడా జ‌న‌సేన‌కు కావ‌ల్సినంత స‌హాయ స‌హ‌కారాలు ల‌భించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు చిత్ర‌సీమ‌లో చాలామంది ఉన్నారు. యువ హీరోలంతా ప‌వ‌న్ వీరాభిమానులే. వాళ్లంతా జ‌న‌సేన‌కు సైలెంట్ గా స‌పోర్ట్ చేస్తున్నారు. కొంత‌మంది హీరోలు జ‌న‌సేన‌కు మంచి మొత్తంలో విరాళాలు పంపుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. చిరంజీవి ఈరోజు జ‌న‌సేన పార్టీకి ఏకంగా రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ అభిమానులైన కొంత‌మంది హీరోలు ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు విరాళాలు అంద‌జేసేశార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ప్ర‌చార చిత్రాలు రూపొందించ‌డంలోనూ, పొలిటిక‌ల్ యాడ్స్ తీర్చిదిద్ద‌డంలోనూ కొంత‌మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు జ‌న‌సేన‌కు అండ‌దండ‌గా ఉన్నారని స‌మాచారం. సాధార‌ణంగా టీడీపీకి ఇలాంటి స‌పోర్ట్ ఉండేది. సీరియ‌ర్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల్లో చాలామంది టీడీపీ అభిమానులే. వాళ్లంతా ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున యాడ్స్ రూపొందించ‌డంలో స‌హాయ స‌హ‌కారాలు అందించేవారు. జ‌న‌సేన ఇప్పుడు టీడీపీతో చేతులు క‌లిపింది. అందుకే… జ‌న‌సేన‌కు సైతం వాళ్లంతా స‌హాయంగా నిలుస్తున్నారు. ఈ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నిపించ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close