నిఖిల్ కోసం టాప్ 3 దర్శకులు

నిఖిల్ అంటే…. మ‌న స్వామి రా రా నిఖిల్ కాదు. జాగ్వార్ హీరో నిఖిల్‌. దేవ‌గౌడ మ‌న‌వ‌డు, కుమార‌స్వామి త‌న‌యుడు ఈ నిఖిల్‌. తాను క‌థానాయ‌కుడిగా న‌టించిన జాగ్వార్ త్వర‌లోనే విడుద‌ల అవుతోంది. ఈ సినిమా కోసం రూ.70 కోట్లకు పైచిలుకు ఖ‌ర్చు పెట్టడం, ప‌బ్లిసిటీ కూడా అదే రేంజులో చేయ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. నిఖిల్ రెండో సినిమా కోసం కూడా అప్పుడే వేట మొద‌లైంది. ఈసారి టాలీవుడ్ టాప్ ద‌ర్శకుడి చేతిలో నిఖిల్‌ని పెట్టడానికి కుమార‌స్వామి త‌న‌వంతు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. అందుకే టాలీవుడ్లో టాప్ ద‌ర్శకులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే పూరి జ‌గ‌న్నాథ్‌, త్రివిక్రమ్‌, కొర‌టాల శివ‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు కుమార‌స్వామి తెలిపారు. రెండో సినిమా క‌చ్చితంగా ఓ అగ్ర ద‌ర్శకుడితో ఉండ‌బోతోంద‌ని వ‌చ్చే యేడాది దానికి శ్రీ‌కారం చుడ‌తామ‌ని ప్రక‌టించారు.

ప‌వ‌న్‌తో కూడా ఓ సినిమా ఉంటుంద‌ని, అందుకు ప‌వ‌న్ అంగీక‌రించార‌ని, ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు త‌మ‌తో ఓ సినిమా చేస్తార‌ని కుమార‌స్వామి ప్రక‌టించారు. అంతేకాదు.. త్వర‌లోనే జ‌గ‌ప‌తిబాబు హీరోగా ఓ సినిమా మొదలెడ‌తార‌ట‌. అందుకు సంబంధించిన క‌థ కూడా రెడీ అయిపోయింద‌ని చెప్పారు. లెజెండ్ త‌ర‌వాత విల‌న్ పాత్రల‌కు ఫిష్ట్ అయిపోయిన జ‌గ్గూభాయ్ జాగ్వార్‌లో ఓ కీల‌క పాత్ర చేశారు. విల‌న్‌గా ట‌ర్న్ అయ్యాక‌… జ‌గ్గూభాయ్ మ‌ళ్లీ హీరోగా చేసే తొలి చిత్రం ఇదే. మొత్తానికి కుమార స్వామి టాలీవుడ్‌లో పాతుకు పోవ‌డానికి. త‌న‌యుడికి లైన్ క్లియ‌ర్ చేయ‌డానికి బాగానే క‌ష్టప‌డుతున్నట్టు అర్థమ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close