బిగ్ బాస్ హారిక కెరీర్‌తో ఆడుకున్న టీఆర్ఎస్ నేతల వర్గపోరాటం..!

టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా దేత్తడి హారిక మానసిక క్షోభకు గురి కావాల్సి వచ్చింది. తనకు టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు వచ్చిందని .. పదవి ఇచ్చినప్పుడు ఆమె సంతోషపడ్డారు. అయితే.. ఆమె నియామకంగా చెల రేగిన వివాదంతో… మనస్థాపానికి గురయ్యారు. తాను ఆపదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే టీఆర్ఎస్‌లో మాత్రం.. హారిక నియామకం ప్రకంపనలు ఆగడం లేదు. అసలు ఈ వివాదంలో హారికకు సంబంధమే లేదు. ఆమెను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా నియమించారు. ఆయనకు ఎలా ఎందుకు నియమించాలని అనిపించిందో.. తెలియదు కానీ.. ఎవరికీ చెప్పకుండా.. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా నియామకం జరిపేశారు.

అయితే ఈ విషయంలో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఊరుకుంటారు. తనకు తెలియకుండా నియామకం చేయడం ఏమిటని ఆయన ఫైరయిపోయారు. నేరుగా సీఎంవో అధికారులతో ఫోన్ చేయించి… శ్రీనివాస్ గుప్తాకు చీవాట్లు పెట్టించారు. వెబ్ సైట్ నుంచి వివరాలు తీసేశారు. అంతే కాదు.. శ్రీనివాస్ గౌడ్ ఇంకా దారుణంగా హారిక గురించి మాట్లాడారు. దేత్తడి హారిక ఎవరో తనకు తెలియదని ప్రకటించేశారు. దీంతో హారిక మరింత నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నియామక పత్రం ఇచ్చి… వివాదం చేయడం మాత్రమే కాకుండా.. . తనను కించ పరిచేలా మాట్లాడుతూండటంతో ఆమె హర్ట్ అయ్యారు. అయితే పొలైట్‌గానే పదవికి గుడ్ బై చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ – గుప్తాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదని చాలా కాలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

హోదాలో పై స్థాయిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను లెక్క చేయకుండా… శ్రీనివాస్ గుప్తా నిర్ణయాలు తీసుకుంటారని అది గౌడ్‌కు నచ్చదన్న ప్రచారం ఉంది. వీరి ఆధిపత్య పోరాటంలో హారిక బలైపోయింది. ఇప్పుడు ఈ వివాదం పూర్తిగా పక్కకు తొలగి.. తాను వెబ్ సిరీస్‌ల మీద దృష్టి పెడతానని హారిక చెబుతున్నారు. మొత్తానికి తనకు సంబంధం లేకుండానే రాజకీయ వివాదంలో చిక్కుకున్న హారిక మానసిక ఒత్తిడికి గురయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close