ట్రెండ్స్: రెండు ఎమ్మెల్సీలూ గులాబీకే..!?

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడల్లా తేలేలా లేవు. మరో రోజున్నర పట్టే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా.. శనివారం ఉదయం మాత్రమే ఫలితాలు డిక్లేర్ అవుతాయి. ఎందుకంటే.. పోటీ హోరాహోరీగా సాగడంతో.. ఎవరికీ మొదటి ప్రాధాన్యతా ఒట్లలోనే యాభై శాతం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ… అటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు రెండింటిలోనూ… టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. నల్లగొండ నుంచి బరిలో ఉన్న పల్లాకు కంఫర్టబుల్ లీడ్ అందుతోంది. అక్కడ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో.. కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రేసులో లేరు.. నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే పీవీ కుమార్తె సురభి వాణి దేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కానీ ఆధిక్యం… మూడు, నాలుగు వేల ఓట్ల మధ్యలోనే ఉంటోంది. యాభై శాతం ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో .. ద్వితీయప్రాధాన్యఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. అయితే .. ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేదన్న వాదన రాజకీయ నిపుణుల్లో వినిపిస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైనట్లే. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కొద్దిగా వచ్చినా ఆయన విజయం సాధిస్తారు. అయితే.. హైదరాబాద్ ఎమ్మెల్సీ మాత్రం ఉత్కంఠగా మారుతోంది. గెలుపోటములు తారుమారయ్యే చాన్స్ కూడా ఉంది.

అందుకే… కౌంటింగ్‌పై అందరూ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గట్టి పోటీనే ఇస్తున్నారు. బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్… మూడో స్థానంలో ఉన్నా… చాలా ఎక్కువ ఓట్లే తేడా కనిపిస్తోంది. దీంతో ఆయన ముందుకు రావడం కష్టంగా మారుతోంది. రేపు ఉదయానికి గెలుపెవరిదో.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా.. అధికారిక ప్రకటన మాత్రం.. మరో రోజు.. రోజున్నర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close