అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలను ఆపడంలో బిజీగా ఉన్నారు. తాజాగా థాయిల్యాండ్,కాంబోడియా మధ్య ప్రారంభమైన ఉద్రిక్త పరిస్థితుల్ని కూడా ఆపేశారని ప్రకటించారు. గత నాలుగు రోజులుగా రెండు దేశాలు కాల్పులు జరుపుకుంటున్నాయి. తాజాగా ట్రంప్.. ఆ రెండు దేశాలతో మాట్లాడానని.. ఇక యుద్ధం జరగదన్నారు. అమెరికాతో వ్యాపారం చేయాలంటే.. యుద్ధాన్ని ఆపాలని చెప్పానని.. వెంటనే అంగీకరించారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సమయంలోనూ అదే చెప్పారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలోనూ అదే చెప్పారు. తాను యుద్ధాలను ఆపేస్తున్నానని నోబెల్ బ హుమతికి అర్హుడినని చెప్పుకుటున్నారు. సరిహద్దు దేశాలు అయిన కంబోడియా, ధాయి ల్యాండ్ మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరిహద్దుల్లోని ఓ ఆలయం వద్ద ఏర్పడిన వివాదంలో ఓ థాయ్ ల్యాండ్ సైనికుడు చనిపోయాడు. రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకున్నాయి.
ఈ వివాదాలతో థాయ్లాండ్ ప్రధాని పేటాంగ్తార్న్ షినవత్రా రాజీనామా చేయాల్సి వచ్చింది. కంబోడియా ప్రధానిని షినవత్రా అంకుల్ అని పిలిచిన ఆడియో లీక్ అయింది.ల దీనితో ఆమెను సస్పెండ్ చేసి, ఫుమ్తామ్ వేచయాచైని తాత్కాలిక ప్రధానిగా నియమించారు. తర్వాత కాంబోడియాపై దాడులు ప్రారంభమయ్యాయి.
చైనాకు రెండు దేశాలతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, కానీ కంబోడియాతో ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అయితే అమెరికాతోనూ వ్యాపారం ఉంది. అందుకే ట్రంప్ .. బెదిరించి యుద్ధం ఆపేయించానని ప్రకటించారు. ట్రంప్ ఆడడానికే దేశాలు ఘర్షణలకు దిగుతున్నాయేమో కానీ.. ట్రంప్ కు మాత్రం చాలా ఆవకాశాలు వస్తున్నాయి.