పాలనకు రెండేళ్లు : కొంచెం ఇష్టం.. ఎంతో కష్టం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లయింది. అంటే నలభై శాతం తన పరిపాలనా సమయం ముగిసింది. ఈ రెండేళ్లలో ఏం చేశారో సమీక్ష చేయడానికి తగినంత సమయం అయిపోయినట్లే. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఫలితాలు.., ప్రభావాలు అన్నీ కనిపించడం ప్రారంభించాయి. మరి ఈ రెండేళ్లలో ఆయన పాలన రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్రజల్ని… ముందుకు తీసుకెళ్లిందా.. వెనక్కి తీసుకొచ్చిందా.. అంటే… కొంచెం ఇష్టం.. ఎంతో కష్టం అని చెప్పుకోవాలి. నిజానికి ఇలా చెప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి పరిస్థితి అయితే రెండేళ్లలో ఏర్పడింది.

పారిన పథకాలు..!

రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన ప్లస్ పాయింట్లలో ఒకటి నుంచి వంద వరకు చెప్పుకోవాల్సింది నగదు బదిలీ పథకాల గురించే. మేనిఫెస్టో ప్రకారం… ఒక్కో కుటుంబానికి ఏటా రూ. రెండు లక్షలకుపైగానే లబ్ది కలిగిస్తామని జగన్ లెక్క చెప్పారు. ఆ ప్రకారం ఆయన చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ప్రభుత్వానికి ఆదాయం … అప్పుల కోసం తీవ్రంగా శ్రమించారు. ఆదాయం కోసం… మద్యం విధానాన్ని మార్చడంతో పాటు.. వివిధరకాల పన్నులు పెంచడం దగ్గర్నుంచి అప్పుల కోసం క్రియేటివిటీగా ఆలోచించి కార్పొరేషన్ల ద్వారా… కనీసం.. రెండేళ్లలో రెండు లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. షెడ్యూల్ ప్రకటించి.. ఆ తేదీల ప్రకారం.. ఒక రోజు అటూ ఇటూ అయినా… ల్యాప్‌ట్యాప్‌లో మీట నొక్కుతున్నారు. అదే్ గొప్ప పరిపాలనగా.. చెబుతున్నారు.

అభివృద్ధి చేయలేక పథకాలే అభివృద్ధి అనే వాదన..!

రెండేళ్ల కాలంలో పెట్టుబడి వ్యయం దాదాపుగా సున్నా. పెట్టుబడి వ్యయం కింద చూపించిన మొత్తం ఏమైనా ఉంటే.. అది.. ఆయా అభివృద్ధి పనుల్లో పని చేస్తున్న వారి జీతాలు.. ఇతర ఖర్చులు మాత్రమే. వాస్తవంగా ఎలాంటి అభివృద్ది లేదు. రెండేళ్లుగా ఏమీ చేయడం లేదని.. ఆరోపిస్తున్న విపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సర్కార్… తాము ఇస్తున్న పథకాలే అభివృద్ధి అని వాదించడం ప్రారంభించింది. తాము ఇస్తున్న డబ్బులతో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని.. అంత కంటే అభివృద్ధికి నిర్వచనం ఏముటుంది ప్రశ్నిస్తున్నారు. తలా పదివేలు ఇవ్వడం కన్నా.. వారికి ఉపాధి కల్పించేలా…ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టడం అనేదిఇప్పటి వరకూ చేస్తూ వచ్చారు. జగన్ సర్కార్… ఆ పని మానేసి. ప్రజలకు పంచుతోంది. దీంతో డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చయిపోతున్నాయి కానీ.. ప్రజల ఆర్థికపరిస్థితుల్లో మార్పు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగాహనే… ఉద్దానం వెళ్లి ఓ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రెండేళ్లయినా ఆ ఆస్పత్రి పునాదులు కూడా పూర్తి కాలేదు. అది ఉదాహరణ… రాష్ట్రంలో అన్ని అభివృద్ది పనులూ అంతే. గత ప్రభుత్వం చేపట్టినవన్నీ ఎక్కడవక్కడ ఆపేశారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. కానీ వాటి కాంట్రాక్టర్లను మాత్రం మార్చేశారు.

దివాలా అంచుకు చేరిన ఆర్థిక వ్యవస్థ..!

ప్రతి నెలా ఏడు వేల కోట్లు అప్పు పుట్టించుకోవాలి. లేకపోతే.. ఆ నెల దివాలా అని రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్బీఐ దగ్గర ప్రతీవారం రూ. రెండు వేల కోట్ల అప్పు తేస్తున్నారు. చిత్రవిచిత్రమైన కార్పొరేషన్లు పెట్టి.. అదే పనిగా అప్పులు తెస్తున్నారు. ఈ ఏడాది అప్పుల తిరిగి చెల్లింపులకు కనీసం రూ. ముప్పై వేల కోట్లు కావాలి. అంటే.. సగటున నెలకు.. మూడు వేల కోట్ల వరకూ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీతాలు.. పెన్షన్లు.. పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఖర్చులే తప్ప ఆదాయం పెరిగే మార్గం లేదు. అందానీ ఆఠానీ.. ఖర్చారూపయ్యా.. అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చివరికి ప్రభుత్వ మార్కెట్లు… క్వార్టర్స్ ఏమైనా ఉంటే అమ్మడానికి ప్లాన్ చేశారు. అత్యంత ఖరీదైన స్థలాలను బేరం పెట్టారు. ఈ పరిస్థితులన్నీ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నాయో కానీ.. ఆర్థికంగా మాత్రం… ఇంత అధ్వాన్నమైన నిర్వహణ మరొకటి ఉండని.. నిపుణులు సైతం నోరెళ్లబెట్టే పరిస్థితి.

కరోనా కన్నా కక్ష సాధింపులే ప్రయారిటీ..!

మహమ్మారి ప్రజలపై దాడి చేసినప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఒకటే ప్రయారిటీ ఉండాలి. కానీ ఏపీ సర్కార్ మాత్రం కరోనాను లైట్ తీసుకుంది. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణిచి వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అరెస్టులతో హోరెత్తిస్తోంది. కానీ అలాంటి వాటితో… ప్రత్యర్థుల్ని అణిచివేయగలమన్న రాజకీయం మనుగడ సాగించడం చరిత్ర చెబుతోంది. రఘురామరాజు ఇష్యూలో అధికారులు కూడా నిండా ఇరుక్కుపోయారు. కేంద్రం మద్దతు ఉంది కాబట్టే… ప్రభుత్వం ఇలా చేయగలుగుతుంది. కేంద్రంతో సంబంధాలు చెడిన రోజున… ప్రభుత్వం దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందని .. బెంగాల్‌ని చూసి చెప్పొచ్చు.

మొత్తంగా రెండేళ్లలో అమరావతి దగ్గర్నుంచి పోలవరం వరకూ అన్నీ పడకేశాయి. ఇసుక విన్యాసాలతో నిర్మాణ రంగం కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఒక్క వర్గానికే ప్రాధాన్యం లభిస్తోందని ఇతర వర్గాలు తీవ్ర అసహనంలో ఉన్నాయి. ఏపీ ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయింది. డైరీ దగ్గర్నుంచి ఇసుక వరకూ వ్యవస్థీకృత దోపిడి జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జగన్ రెడ్డి పాలనపై తీర్పు చెప్పడం..తొందరపాటు అవుతుంది. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ప్రజలు అప్పుడు ఇచ్చే తీర్పే అసలైన తీర్పు.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close