సీమలో ఉయ్యాలవాడ విగ్రహ వివాదంపై రచ్చ !

రోడ్లపై ఎక్కడ చూసినా వైఎస్ విగ్రహాలు కనిపిస్తాయి. ఒక్క దానికీ అనుమతి ఉండదు. సుప్రీంకోర్టు విగ్రహాల విషయంలో చాలా స్పష్టమైన రూల్స్ పెట్టింది. కానీ పట్టించుకోరు. ఇష్టం లేని విగ్రహాల విషయంలో అయితే మాత్రం రూల్స్ అమలు చేస్తారు. తాజాగా అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ను అడ్డుకున్నారు. దీనిపై రెడ్డి సామాజికవర్గంలోనే పెద్ద చర్చ జరుగుతోంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ అంశంపై వైసీపీ నేతలపై మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరణ అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు, రాయలసీమ నడిబొడ్డున కర్నూలు కొండారెడ్డి బురుజు పై ఉరితీసిన నర్సింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్నారు. అనంతపురం జిల్లాలో ఇంత మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు…. మీరంతా ఏం చేస్తున్నారు…. సోమవారం లోపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే నేనే వచ్చే ఆవిష్కరించుతానని సవాల్ చేశారు.

ఊర్ల నిండా ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు కానీ ఈ ప్రాంత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే రెడ్ల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కు అల్టిమేటమ్ జారీ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ లేదని ఆపిన కలెక్టర్ అన్న విగ్రహాలకు పర్మిషన్ ఉందా అంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు జేసి ప్రభాకర్ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దుస్థితిలో ఉన్నారు అనంతపురం జిల్లాలోని రెడ్డి ఎమ్మెల్యేలు…. ఇది సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రెడ్డి వర్గం నేతల్లోనూ చర్చ జరుగుతోంది. వైఎస్ రెడ్డి విగ్రహాలే ఉండాలా.. ఉయ్యాలవాడవి ఉండొద్దా అన్న ప్రశ్న వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

పేరుకే పాతిక కోట్లు.. అంతా ఎగ్గొట్టేవారే!

పాపం... టాలీవుడ్ లో ఓ హీరో ప‌రిస్థితి చూస్తే జాలేస్తోంది. ఎలాంటి అండ దండ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి, స్టార్ గా ఎదిగిన హీరో అత‌ను. పారితోషికం మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూ, ఇప్పుడు పాతిక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close