‘జిగ‌డ్తాండ’ టూ ‘వాల్మీకీ’…. హ‌రీష్ ఏం చేశాడో?

ఎట్ట‌కేల‌కు హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తోంది. ఈ రోజే ‘జిగ‌డ్తాండ’ రీమేక్ అధికారికంగా మొద‌లైంది. ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టుకున్నాడు హ‌రీష్‌. ద‌బాంగ్ ని తెలుగులో రీమేక్ చేసిన‌ప్పుడు… కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన మార్పులు చేశాడు హ‌రీష్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ మ‌ల‌చుకున్నాడు. అస‌లు అది ద‌బాంగ్ రీమేక్ అనే సంగ‌తే మ‌ర్చిపోయేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ‘జిగ‌డ్తాండ‌’ విష‌యంలోనూ అలాంటి మార్పులే కావాలి. జిగ‌డ్తాండ అంటే ఓ పానియం పేరు. దాన్ని ‘వాల్మీకి’గా మార్చాడు హ‌రీష్‌. త‌న మార్పులు ఇక్క‌డి నుంచే మొద‌ల‌య్యాయ‌న్న‌మాట‌. బాబీ సింహా వేసిన పాత్ర‌ని వ‌రుణ్‌తేజ్‌కి అప్ప‌గించాడు. నిజంగా ఇది మ‌రో మంచి ఎత్తు. ప్ర‌తినాయ‌కుడిగా వ‌రుణ్‌తేజ్‌ని చూడ‌బోతున్నాం. దేవిశ్రీ ప్ర‌సాద్‌ని తీసుకొచ్చి… టెక్నిక‌ల్‌గా ఈ సినిమా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకున్నాడు. మొత్తానికి ప్యాకేజీ మాత్రం అదిరింది. కావ‌ల్సినంత ప్ర‌తిభ ఉన్నా.. స‌రైన రీతిలో దాన్ని ప్రాజెక్ట్ చేయ‌లేక చ‌తికిల ప‌డుతున్న హ‌రీష్‌కి ఇప్పుడు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. రాసుకున్న క‌థ‌లు వ‌ర్క‌వుట్ కాన‌ప్పుడు, రీమేక్ క‌థ‌లే దారి చూపిస్తాయి. ఇప్పుడు హ‌రీష్ విష‌యంలో అదే జ‌రుగుతోంది. ద‌బాంగ్ సినిమాని గ‌బ్బ‌ర్ సింగ్‌గా తీసి హిట్టుకొట్టిన హ‌రీష్‌.. ఇప్పుడు జిగ‌డ్తాండ‌ని ఏం చేస్తాడో చూడాలి..? ఆ వాల్మీకి రామాయ‌ణం రాస్తే… ఈ వాల్మీకి హ‌రీష్ శంక‌ర్ భ‌విష్య‌త్తు రాయ‌బోతున్నాడు. అదెలా ఉంటుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close