ఒక్క దెబ్బకు మూడు పిట్టలు: కేటీఆర్ ఈటెల హరీష్ రావు ల పై పంచ్ లు విసిరిన రాములమ్మ

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అధికార టిఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడి చేసే విజయశాంతి మరొకసారి అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తెలంగాణలోని విష జ్వరాల మీద చర్యలు తీసుకోవాల్సిన ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తన పదవిని కాపాడుకోవడం లో నిమగ్నమై ఉన్నాడు అని, విష జ్వరాల సాకు చూపెట్టి అతనిని ఎలాగైనా మంత్రి పదవి నుండి తప్పించాలని కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇవేవి పట్టకుండా తాను ముఖ్యమంత్రి కావడానికి మరొక వైపు నుండి హరీష్ రావు పావులు కదుపుతున్నారు అని విజయశాంతి విమర్శించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది.

విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ” తెలంగాణలో జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం… కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అందరి కంటే తనకు రాజకీయాల్లోనూ పాలనాపరంగా ముందుచూపు ఉందని ప్రకటించుకునే కెసిఆర్ గారు.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి… తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్న ప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రోజు ఈటల రాజేందర్ గారు జిహెచ్ఎంసిలో సమావేశం నిర్వహించి… ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కనుసన్నల్లోనే ఇప్పటికీ జిహెచ్ఎంసితో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారిమెడకు చుట్టాలని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఇంత బీభత్సం జరుగుతున్నా…. మాజీ మంత్రి హరీష్ రావు గారు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా… తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి… తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ… చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైంది. బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చి కేసీఆర్ అండ్ కో ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితంతో ఆడుకుంటుందో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.” అని రాసుకొచ్చారు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి కానీ, విజయశాంతి వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలి ఉండడం నిజమే. దీంతోపాటు వర్షాల కారణంగా ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచి ఉండడం, తద్వారా మరిన్ని రోగాలు వస్తూ ఉండడం కూడా నిజమే. జిహెచ్ఎంసి నింపాదిగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యాల తో చెలగాటమాడుతున్నది అంటూ హైదరాబాదు లోని పలువురు ప్రజలు అభిప్రాయపడుతుండటం కూడా నిజమే. అయితే ఈ సమస్యలపై అటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు బిజెపి నాయకులు కానీ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. అధికార పార్టీ నేతలు ఏమో రాబోతున్న మంత్రివర్గ విస్తరణ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు లేక పోవడంతో, విజయశాంతి వ్యాఖ్యలకు ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది.

మరి ఇప్పటికైనా అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు జిహెచ్ఎంసి మేలుకొని సరైన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close