చైతన్య : యువతను నిర్వీర్యం చేసే వాలంటీర్ వ్యవస్థ !

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. డిగ్రీ ఆపైన చదువుకున్న లక్షల మంది ఐదు వేల రూపాయలతో పని చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ పరమైన ప్రాధాన్యత లభిస్తూండటంతో వారంతా ఇతర లక్ష్యాల్ని వదిలేసి.. పూర్తిగా దానికే పరిమితమవుతున్నారు. దీంతో లక్షలమంది యువతీ యువకుల భవిష్యత్తుని జగన్ ప్రభుత్వం ఎదుగుదలలేకుండా కుదించేసింది. ఇది యువత భవిష్యత్‌ను… నాశనం చేయడమే.

యువశక్తిని నిర్వీర్యం చేయడం దేశానికి నష్టం చేయడమే !

నేటి యువతే రేపటి దేశభవిష్యత్‌కు పునాదులు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఉద్యోగాలు ఉపాధికల్పనా ప్రభుత్వ బాధ్యత. వనరులు అవకాశాలు, అవసరాలను మదింపు చేసి ఐదు, పదేళ్ళ వ్యవధికి ఉపాధి అవకాశాలను నిర్ధారణ చెయ్యాలి. ఆ మేరకు ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం ఎదురుగా వున్నఅవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగాలు ప్రపంచ మంతా విస్తరిస్తున్న సమయంలో చురుగ్గా ఓపిగ్గాసూక్ష్మంగా పనిచేయగల సామర్థ్యం వున్న భారతీయులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటిపోటీ ప్రపంచంలో యువతను ఎలా తయారు చేయాలి..? ఎలా తయారు చేస్తున్నారు ?

భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకోవాలి.. రాజకీయ స్వార్థం కాదు !

1996 లో ఐటి సాఫ్ట్ వేర్ రంగాల భవిష్యత్తుని పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాల్లోవిద్యావకాశాలు సృష్టించారు. 600 ఇంజనీరింగ్ కాలేజిలు నెలకొల్పేలా చూశారు. ఈ అవకాశాలను చంద్రబాబుసద్వినియోగం చేసుకుని రూపొందించిన ప్రణాళికల వల్ల దాదాపు 20 ఏళ్ళపాటు తెలుగు టెకీలకు ఒకట్రెండ్ గా ఉద్యోగాలు వచ్చాయి. ఇదంతా చంద్రబాబు వల్ల మాత్రమే జరిగిందని చెప్పలేం కానీ.. ఆయన పరిస్ధితిని అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోగలిగారని చెప్పవచ్చు. పాలకుడు చేయాల్సింది కూడా అదే.

యువతను నిర్వీర్యం చేసి ఏం సాధిస్తారు ?

వాలంటీర్ల ని నియమించడంతో జగన్ రాజకీయ అవసరాలే తప్ప విజన్ ఏమీ లేదు. సరళీకృత ఆర్ధికవిధానాల వల్ల ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి. వాటిని అందుకోవడానికి అవసరమైన ఇన్ ఫ్రాను, వాతావరణాన్ని ఏర్పరచడమే ప్రభుత్వాల బాధ్యత! ఆ బాధ్యతను అంటే ఆహారాన్ని సంపాదించే దారినిచంద్రబాబు చూపించారు. కానీ వాలంటీర్లతో వాలంటీర్ల తో జవాబుదారీతనం లేకుండా, ఇప్పటికే ఉన్న సిస్టమ్ కు సమాంతరంగాపనిచేసే ఏ వ్యవస్ధ అయినా ఊహించని సమస్యలకు, ప్రమాదాలకు దారితీస్తుంది . ఇప్పుడు అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close