నోటిఫికేషన్లు ఎప్పటి నుండి !?

ఉద్యోగాలు అయితే ప్రకటించారు.. కానీ నోటిఫికేషన్లు ఎప్పటి నుండి అన్న అంశంపై మాత్రం తెలంగాణ నిరుద్యోగులకు స్పష్టత లేకుండా పోయింది. అధికారులు కూడా ఏమీ చెప్పడం లేదు. మీడియాలకు ఇంటర్యూలు ఇస్తున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి కూడా నోటిఫికేషన్లు ఫలానా తేదీ నుంచి వస్తాయని చెప్పడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఉద్యోగాల భర్తీ చేసిన రికార్డు లేకపోవడమే దీనికి కారణం.

భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేయడం టీఎస్‌పీఎస్సీ వల్ల కాదని.. కొత్త బోర్డును ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. గ్రూప్స్ ఉద్యోగాలు టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసినా… ఇతర పోస్టులన్నీ కొత్త బోర్డుద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి, ఇద్దరు ఐఏఎస్లకు సారథ్యబాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. టెక్నికల్ పరమైన ఉద్యోగాలతో పాటుగా ఇంజినీరింగ్ ఉద్యోగాల నియామకం ఈ బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది.

అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బోర్డు ఏర్పాటు చేసి..భర్తీ చేస్తామని చెప్పడం.. ఆలస్యానికేనని నమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో ఏ మాత్రం నమ్మకం కలిగించలేదు. ఆ తర్వాత తీసుకుంటున్న చర్యలు కూడా అంతే ఉన్నాయి. ఇది ప్రభుత్వంపై నమ్మకం సడలిపోవడానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close