బీజేపీలో చేరిన వాళ్లందరిపై కేసులేమయ్యాయో చెప్పాలంటున్న కేటీఆర్ !

దేశంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ పక్షాలపై కక్ష తీర్చుకోడానికి … అవినీతి పరులైన నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని విపక్షాలు చాలా కాలంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. తర్వాత కవితను అరెస్ట్ చేయడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. దీంతో.. బీజేపీ తీరుపై బీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. సిసోడియా అరెస్ట్ ను.. కేసీఆర్ కూడా ఖండించారు. కవితకు నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఎలా స్పందించారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే కేటీఆర్ మాత్రం బీజేపీపై మరో డిఫరెంట్ ఎటాక్ ప్రారంభించారు. ప్రశాంత్‌ భూషణ్‌.. ‘ఈక్వాలిటీ బిఫోర్‌ లా..?’ అనే పేరుతో బీజేపీలో చేరిన తర్వాత పునీతులైన వారి పేర్లను సోషల్ మీడియాలో పోస్ట్ ేశారు. వారంతా బీజేపీలో చేరక ముందు తీవ్ర కేసులు ఎదుర్కొన్న వారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై విచారణలు ఆగిపోయాయి. నారాయ‌ణ్ రాణే 300 కోట్ల మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇరుకుంటే ఆయ‌న బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.. వెంట‌నే దానిపై విచార‌ణ నిలిచిపోయింది.. నార‌ద స్కామ్ లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ నేత సువేంధు అధికారి క‌మలంలో చేరిన వెంట‌నే ఆ కేసు ఎటో వెళ్లిపోయిందన్నారు. లంచం కేసులో చిక్కుకున్న అసోం నేత హిమాంత భిశ్వ‌శ‌ర్మ బెజెపి గూటికి చేర‌డంతో ఆ కేసు అట‌కెక్కింది. మ‌హ‌రాష్ట్ర శివ‌సేన లీడ‌ర్, ఎంపి గౌలి అవినీతి కేసులో అయిదుసార్లు స‌మ‌న్లు వ‌చ్చిన సంద‌ర్భంలో ఆయ‌న షిండే శిబిరంలో చేరిపోయారు.. ఆ కేసు గురించి ఆలోచించ‌డ‌మే మానివేశారు.. య‌శ్వంత్ జాద‌వ్ దంప‌తులు కషాయం క‌ప్పుకోవ‌డ‌తో వారి కేసులు మాఫీ అయిపోయాయి.. అంటూ ప్ర‌శాంత్ భూష‌ణ్ పేర్కొన్నారు. ఆ ట్విట్ ను కెటిఆర్ రీ ట్విట్ చేశారు.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీలో చేరిన వారిపై కేసులను పట్టించుకోడం లేదు. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపైనా గురి పెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో .. కేటీఆర్.. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటున్నారో వివరించేలా ఉన్న ఈ ట్వీట్ కు బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఇలాంటి వాటిపై వారెప్పుడూ మాట్లాడరు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close