టీటీడీ పిల్లల ఆస్పత్రి కడతామన్న “ఉద్వేగ్” ఏమయింది !?

టీటీడీకి రూ. మూడువందల కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆస్పత్రి కట్టిస్తామని గతంలో ఎంవోయూ చేసుకున్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రా కంపెనీ చప్పుడు చేయడం లేదు. ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను రూ. కోటి.. కోటిన్నరకు అమ్మి చిన్నపిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామని ఇప్పుడు టీటీడీ చెబుతోంది. అసలు ఓ సేవ టిక్కెట్లను అంత పెద్ద మొత్తానికి అమ్మడమే విచిత్రం అనుకుంటే.. ఆ సేవ టిక్కెట్లను పాలక మండలి సభ్యులే అత్యధికంగా కొనుగోలు చేస్తూండటం మరింత వివాదంగా మారింది. ఈ తరుణంలో అసలు పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామని వచ్చిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రా ఏమయిందన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది.

ఉద్వేగ్ ఇన్‌ఫ్రా పేరుతో ఓ కంపెనీ యజమానికి తిరుమలకు వచ్చి రూ. మూడు వందల కోట్లతో చిన్న పిల్లల ఆస్పత్రి కట్టేస్తానని.. అది మొత్తం విరాళమేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఎంవోయూ కూడా చేసుకున్నారు. మామూలుగా విరాళం అయితే…చెక్ తీసుకోవాలి.. లేకపోతే ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి..కానీ ఇక్కడ ఉద్వేగ్‌ యజమానితో టీటీడీ యాజమాన్యం ఎంవోయూ చేసుకుంది. తర్వాత ఆ ఉద్వేగ్ కంపెనీ సూట్ కేసు కంపెనీ అని తేలింది.

వ్యాపారాలు.. కార్యాకలాపాలు ఏమీ లేవని.. ఆ కంపెనీ ఖాతాలో రూ. మూడు వందలు కూడా లేవని వెల్లడయింది. అప్పుడే .. ఆ సూట్ కేస్ కంపెనీలో కొంతమంది తెలుగువాళ్లు డైరక్టర్లుగా ఎంవోయూ చేసుకోవడానికి వారం ముందే చేరారని కూడా స్పష్టమయింది. ఇప్పుడా ఉద్వేగ్ కంపెనీ ఏమయింది ? వెనక్కి వెళ్లిపోయిందా.. టీటీడీనే ఎంవోయూ రద్దు చేసుకుందా ? విరాళం ఎందుకు నిలిపివేశారు..? ఇలాంటి వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close