గతవారం విడుదలైన సినిమా ‘డెకాయిట్’. ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. తొలి మూడు రోజులు వసూళ్లు బాగున్నాయి. నిర్మాత సుప్రియకు ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమా. అడవిశేష్ తో పోలిస్తే మృణాల్ ఠాకూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన పాత్ర వల్ల, తన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల సినిమాకు మైలేజీ పెరిగింది. నిజానికి ఈ పాత్ర ముందుగా శ్రుతిహాసన్ దగ్గరకు వెళ్లింది. ఆమెతో టెస్ట్ షూట్ కూడా చేశారు. గ్లింప్స్ ప్రత్యేకంగా షూట్ చేసి వదిలారు. ఆ తరవాత క్రియేటివ్ ఇష్యూస్ వల్ల శ్రుతిహాసన్ సినిమా వదులుకోవాల్సివచ్చింది. ఆ క్షణంలోనే మృణాల్ ఈ టీమ్ లో చేరింది.
ఇప్పుడు ఈ పాత్రకు మృణాల్ కరెక్టా, శ్రుతిహాసన్ కరెక్టా.. అనేది బేరీజు వేసుకొంటే మృణాల్ వైపు మొగ్గు చూపాల్సివస్తుంది. ఈ పాత్రకు మృణాల్ బెస్ట్ ఆప్షన్. ఈ విషయంలో డౌటే లేదు. అసలు ఇంత డెప్త్ ఉన్న పాత్ర కోసం శ్రుతి హాసన్ ని ఎలా ఎంచుకొన్నారా అనిపిస్తోంది. అడవి శేష్ – మృణాల్ కెమిస్ట్రీ అంతంత మాత్రమే పండింది. అదే శేష్ – శ్రుతి కాంబో అయితే అవుట్ రేటెడ్ గా రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. శేష్ కూడా ”శ్రుతి ఈ సినిమాని వదిలేసిందన్న బాధ లేదు. మాకు మృణాల్ రూపంలో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఓరకంగా.. మృణాలే ఈ పాత్రకు సరిజోడీ” అని చెప్పేశాడు. సో.. శ్రుతి ఈ సినిమాని వదులుకోవడం వల్ల చిత్రబృందానికి మేలే జరిగింది.
శ్రుతి ఈ సినిమా నుంచి బయటకు వెళ్లిపోవడం కూడా చాలా స్మూత్ గా జరిగిపోయిందని నిర్మాత సుప్రియ చెప్పుకొచ్చారు. ”శ్రుతితో మాకు ఎలాంటి ఇబ్బందీలేదు. మా షూటింగ్ ఆలస్యమైంది. ఆ సమయంలో శ్రుతికి కమిట్మెంట్స్ ఉన్నాయి. మా ప్రాజెక్ట్ కోసం శ్రుతిని ఆపలేం” అన్నారు సుప్రియ.


