భారత్ అంటే అందుకే నాకు అంత ద్వేషం: హెడ్లీ

పాక్-అమెరికా దేశాలకు చెందిన లష్కర్ తోయిబా ఉగ్రవాది ఈరోజు మరొక దిగ్బ్రాంతి కలిగించే విషయం ముంబై కోర్టుకి తెలియజేసాడు. తను భారత్ ని తన చిన్నపాటి నుంచే చాలా ద్వేషిస్తున్నానని చెప్పాడు. భారత్ కి వీలయినంత ఎక్కువగా నష్టం కలిగించాలన్నదే తన చిరకాల వాంఛ అని చెప్పాడు. అతను భారత్ ని ద్వేషించడానికి చెప్పిన కారణం మరీ విస్మయం కలిగిస్తుంది.

అతని తండ్రి పాకిస్తాన్ పౌరుడు తల్లి అమెరికా పౌరురాలు. వారు ఒకప్పుడు పాకిస్తాన్ లోనే నివసించే వారు. చాలా సంపన్నమయిన కుటుంబమే. పాక్ ప్రభుత్వంలోని పెద్దలతో తమ కుటుంబానికి మంచి పరిచయాలు ఉండేవని హెడ్లీ చెప్పాడు. 1971 సం.లో డిశంబర్ మూడవ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారత్-పాక్ దేశాల మధ్య సుమారు రెండు వారల పాటు ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఆ సమయంలో డేవిడ్ హెడ్లీ స్కూల్లో చదువుకొంటున్నాడు. డిశంబర్ ఏడున భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానాలు పాక్ భూబాగంలోకి ప్రవేశించి తమ స్కూల్ పై కూడా బాంబులు వేశాయని, అప్పుడు అనేక మంది విద్యార్ధులు, ఉపాద్యాయులు కూడా చనిపోయారని, అప్పటి నుంచే తనకు భారత్ అంటే విపరీతమయిన ద్వేషం ఏర్పడిందని హెడ్లీ చెప్పాడు. ఎప్పటికయినా అందుకు భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకొనేవాడినని, తనలో ఆ ప్రతీకారేచ్చ వయసుతోబాటు పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదని, అందుకే తను 2002లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు చెప్పాడు.

ముంబై 2008 ఉగ్రవాదుల దాడుల కేసులో అప్రూవర్ గా మారిన హెడ్లీ ప్రస్తుతం అమెరికాలోని ఒక జైల్లో 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో అతనిని వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతి ద్వారా ముంబై కోర్టు విచారిస్తోంది. ఈరోజు ఆ విచారణలో పాల్గొన్న డేవిడ్ హెడ్లీ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు.

ఒక సంపన్న కుటుంబానికి చెందిన హెడ్లీ ఈవిధంగా కరడుగట్టిన నేరస్తుడుగా మారడం విచిత్రమే. అందుకు అతను చెపుతున్న కారణం కూడా బలంగానే ఉంది కానీ దానిని ఎవరూ సమర్ధించలేరు. ఆ యుద్ధంలో పాక్ పై భారత్ విజయం సాధించినప్పటికీ దానిలో పాక్ ఎంతగా నష్టపోయిందో, భారత్ కూడా అంతే నష్టపోయింది. ఆ యుద్ద సమయంలోనే విశాఖపట్టణంలో పెట్రోలియం సంస్థలపై దాడులు చేయాలనే ఉద్దేశ్యంతో పాక్ జలాంతర్గామి ఒకటి విశాఖ తీరానికి చేరుకొంది. దానిని స్థానిక జాలారులు గుర్తించి సకాలంలో నావికా దళాన్ని హెచ్చరించడంతో వారు దానిని ద్వంసం చేసారు లేకుంటే నేడు విశాఖ నగరమే కనబడేది కాదేమో?

నేటికీ భారత్ పట్ల ప్రక్ ప్రభుత్వం అదే విద్వేషా వైఖరి కనబరుస్తోంది. సుమారు 135 అణు క్షిపణులను భారత్ లోని ప్రముఖ నగరాలకు గురిపెట్టి ఏ క్షణాన్నయినా అవసరమయితే ప్రయోగించేందుకు వీలుగా వాటిని సిద్దంగా ఉంచింది. పాక్ ఉగ్రవాదులు గత రెండు మూడు దశాబ్దాలలో అనేకమంది భారతీయులను అకారణంగా పొట్టన పెట్టుకొంటూనే ఉన్నారు. ముంబైలో జరిగియన్ ఉగ్రదాడుల సంగతి అందరికీ తెలుసు. ఆ కేసులోనే హెడ్లీ నేడు కోర్టు ముందు హాజరవుతున్నాడు. పాక్ సరిహద్దు భద్రతా దళాలు భారత్ కి చెందిన ఇద్దరు జవాన్ల తలలను నరికి తీసుకుపోయినా, పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ పై దాడి చేసి 8మంది సైనికులను చంపి భారతదేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరినా కూడా భారత్ నేటికీ శాంతి మంత్రమే జపిస్తోంది తప్ప పాక్ పై ప్రతీకారం తీర్చుకొనే ఆలోచన చేయడం లేదు. నేటికీ పాక్ ఇటువంటి విపరీత ఆలోచనలు చేస్తున్నప్పటికీ భారత్ లో ఎవరూ కూడా పాక్ పై పగబట్టి హెడ్లీలాగ ఉగ్రవాదిలాగ మారలేదు. కానీ హెడ్లీ ఉగ్రవాదిగా మారడంటే అతనిలో చిన్నప్పటి నుండే అతనిలో నేర ప్రవృతి అంతర్గతంగా కలిగి ఉండి ఉండవచ్చునని అనుమానించవలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close