నాగార్జున అతనికి రెండో సినిమా ఇవ్వడం వెనుక రీజన్‌ ఏమిటో!

కింగ్‌ నాగార్జున లేటెస్ట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి చిత్రాల్లో ది బెస్ట్‌ మూవీ అనిపించుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్‌ కృష్ణను దర్శకుడుగా పరిచయం చేశాడు నాగార్జున. నిర్మాత రామ్మోహన్‌ అందించిన కథని పర్‌ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్‌ చెయ్యలేకపోతున్నాడని సినిమా జరుగుతున్నప్పుడే భావించిన నాగార్జున షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌కి వస్తున్న టైమ్‌లో సినిమాలోని కొంత భాగం నాగార్జునకు నచ్చకపోవడంతో రీషూట్‌ చేశారు. ఎలాగైతేనేం సినిమా సూపర్‌హిట్‌ అయింది, మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది.

కళ్యాణ్‌కృష్ణ వర్క్‌ అంతగా నచ్చకపోయినా అతనికి మళ్ళీ ఓ అవకాశం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో తను నిర్మించేబోయే చిత్రానికి కళ్యాణ్‌కృష్ణను డైరెక్టర్‌గా సెలెక్ట్‌ చేసుకున్నాడు నాగార్జున. అయితే ఈ సినిమాలో తను చేస్తాడా లేక నాగచైతన్య, అఖిల్‌లలో ఎవరో ఒకరు నటిస్తారా అనేది ఇంకా తెలియాల్సి వుంది. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ప్రమోషన్‌లో వున్న నాగార్జున తమ బేనర్‌లో కళ్యాణ్‌కృష్ణ చేయబోయే రెండో సినిమాకి సంబంధించిన వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారట. మొదటి సినిమాతో నాగార్జునను శాటిస్‌ఫై చెయ్యలేకపోయిన కళ్యాణ్‌కృష్ణకు రెండో అవకాశం ఇవ్వడం వెనుక రీజన్‌ ఏమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]