చిరంజీవిని శుభాకాంక్షలు చెప్పడానికి వైసీపీ నేతలకు మనసొప్పలేదే !

చిరంజీవి తమకు ఎంతో దగ్గర అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. చిరంజీవిని అందరూ అభినందిస్తున్నా … వారు మాత్రం నోరు తెరవడం లేదు. చిరంజీవిని పొగిడితే ఎక్కడ తమకు మైనస్ అవుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. చిరంజీవికి కేంద్రం ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ -2022 అవార్డ్‌ ప్రకటించింది. వెంటనే బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెప్పారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు.. చివరికి మోహన్ బాబు కూడా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.

అయితే వైసీపీ నేతల నుంచి మాత్రం ఒక్క అభినందన కూడా రాలేదు. చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచి.. భోజనాలు వడ్డించి.. ఆయన మాకెంతో దగ్గర అన్న అభిప్రాయం కల్పించేందుకు గతంలో ప్రయత్నించిన సీఎం జగన్ కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. ఇక చిరంజీవికి జగన్ అంటే ఎంతో ఇది అని.. స్వయం సర్టిఫికెట్లు జారీ చేసే పేర్ని నాని కూడా స్పందించలేదు. పార్టీ హైకమాండ్ స్పందిస్తే అంతా వరుసగా స్పందిస్తారేమో కానీ.. పై నుంచే స్పందన లేకపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు.. అభినందనులు చెప్పడం కామన్. రాజకీయ విభేధాలతో పని లేదు. మోహన్ బాబు కూడా చెప్పారు. అయితే వైసీపీ మాత్రం ఎప్పుడూ అనుకోదు. రాజకీయాన్నే వ్యక్తిగతంగా తీసుకుంటుంది. ఇటీవల పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరంజీవి మాట్లాడుతున్నారు. ఉన్నత స్థానంలో చూస్తామని అటున్నారు. ఇది వైసీపీ పెద్దలకు నచ్చలేదేమో కానీ.. చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం కూడా ప్రారంభించారు. చిరంజీవిని విమర్శిస్తూ గతంలో మాట్లాడిన వారి వీడియోలోను త్రో బ్యాక్ పేరుతో మళ్లీ పైకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు.. సాక్షి స్టాఫ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close