బండి సంజయ్‌కు ఏదీ కలసి రావట్లేదు! పాదయాత్ర ఉంటుందా ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీకి ఊపొచ్చింది.. దాంతో పాటు ఆయనకూ మంచి ఇమేజ‌్ వచ్చింది. అయితే ఇది ఆయనకు పార్టీలో ప్రతిబంధకాలకు కారణం అవుతోంది. ఓ విడత పాదయాత్ర చేయడానికే ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి అందరి ఆమోదం పొందాల్సి వచ్చింది. హుజురాబాద్ ఉపఎన్నికల కారణంగా తొలి విడత పాదయాత్ర నిలిపివేసి .. ఆ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రెండో విడత పాదయాత్ర ప్రారంభిద్దామనుకుంటున్నారు. కానీ ఆయనకు పరిస్థితులు అనుకూలించడం లేదు.

బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు గట్టి ప్రణాళికలే వేసుకున్నారు. కానీ హైకమాండ్ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఇటీవల అందరూ డిల్లీ వెళ్లారు. అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ అవినీతి గురించి చాలా చెప్పారు కానీ.. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించాలని ఒక్క మాట కూడా చెప్పలేదు. దీంతో బండి సంజయ్ వర్గం నిరాశకు గురైంది. అనుమతి కోసం తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.

అయితే ఈ లోపు ప్రభుత్వంపై తనదైన పోరాటం చేయడానికి నిరుద్యోగ దీక్షలని.. మరొకటని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హఠాత్తుగా ఇచ్చిన సందేశంతో.. ఇప్పుడు దానికీ బ్రేక్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒమిక్రాన్ కారణంగా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశించడం.. హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ సర్కార్ సామూహిక కార్యక్రమాలన్నింటినీ నిషేధించింది. దీంతో నిరుద్యోగ దీక్ష చేయాలనుకున్న సబండి సంజయ్‌కు షాక్ తగిలింది. దాన్ని పార్టీ ఆఫీసులో కొద్ది మంది తో కలిసి చేయాలని డిసైడయ్యారు. పరిస్థితి ఇలానే ఉంటే.. ఇక రెండో విడత పాదయాత్రకు అనుమతి రాదేమోనని.. సంజయ్ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే బీజేపీలోని కొన్ని ఇతర వర్గాలు మాత్రం సంతోషంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close