ఉద్యోగుల సమ్మెకు “ఎస్మా” పరిష్కారం !

ఉద్యోగుల సమ్మె విషయంలో బిందాస్‌గా ఉన్న ప్రభుత్వం చర్చల కోసం రోజూ వచ్చి పోతున్నామని వారే రావడం లేదని ఆరోపణలు చేస్తోంది. జీతాలు బిల్లులు ప్రాసెస్ చేయకపోవడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతోందన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి సిద్ధమైందన్న అనుమానం ఉద్యోగ నేతల్లో ఉంది.

జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులను ఉద్యోగులు రెడీ చేయలేదు. డెడ్‌లైన్‌ ముగిసే సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారయ్యాయి. మొత్తం 4.50 లక్షల బిల్లులు రెడీ చేయాల్సి ఉంది. ఈ కొద్దిగా కూడా ట్రెజరీ అధికారులపై జిల్లాల్లో కలెక్టర్లు ఒత్తిడి చేయడంతోనే సాధ్యమయింది. ఉద్యోగసంఘాలు చర్చకు రావడం లేదంటూ మంత్రులు పదేపదే చెబుతున్నారు. ఇంకేం మార్గం ఉందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి..లేదంటే చట్టం తన పనితాను చేసుకుపోతుందని మంత్రి బొత్స హెచ్చరించడంతో ఎస్మా అంశం తెరపైకి వచ్చింది.

ఉద్యోగ సంఘం నేతలు కూడా తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే ప్రభుత్వం ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవచ్చు. 14 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎస్మావంటి చట్ట ప్రయోగం ఎంత వరకు సాధ్యమవుతుందని చర్చ సాగుతోంది. కానీ కొంత మంది ఉద్యోగ సంఘ నేతల్ని అరెస్ట్ చేస్తే మిగతా వారు దారిలోకి వస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close