మీ భ‌విష్య‌త్తు నా బాధ్య‌త‌… ఇదే చంద్రబాబు ఎన్నికల నినాదం

సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌డ‌చిన ఐదేళ్ల‌లో ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను, ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను, పోరాటాల‌ను మ‌రోసారి వివ‌రించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ‘మీ భ‌విష్య‌త్తు నా బాధ్య‌త‌’ అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నామ‌న్నారు. ముందుగా, తిరుప‌తికి వెళ్లి వెంక‌టేశ్వ‌రస్వామిని ద‌ర్శించుకున్నాక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌లుపెడ‌తామ‌న్నారు. శ్రీ‌కాకుళం నుంచి ప్ర‌చారం ప్రారంభిస్తా అన్నారు.

ఈ ప్ర‌భుత్వానికి ఎన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వ‌చ్చినా, ప్ర‌జాహితం కోసం అన్నీ త‌ట్టుకుని ముందుకుపోయామ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం వ‌ల్ల కలిగిన లాభాలేంటి, విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారి వ్యాఖ్య‌ల్లో వాస్త‌వాలేంట‌ని అంద‌రూ ఒక్క‌సారి ఆలోచించాల‌న్నారు. ఇక్క‌డ ఎన్ని ఇబ్బందులున్నా త‌ట్టుకుని పాల‌నా వ్య‌వ‌స్థ‌ను స్థాపించామన్నారు. ఒక్క పిలుపుతో రైతులు స్వ‌చ్ఛందంగా రాజ‌ధానికి భూములిచ్చార‌నీ, కుటుంబాలు హైద‌రాబాద్ లో ఉన్నా ఇక్క‌డే ఉంటామంటూ ఉద్యోగులు ముందుకొచ్చార‌న్నారు. అయితే, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఐదేళ్ల వ‌ర‌కూ ఇక్క‌డికి రాలేద‌ని ప్ర‌శ్నించారు? ఐదేళ్ల‌పాటు రానివారికి ఓటు అడిగే హ‌క్కు ఎక్కడుందన్నారు? న‌రేంద్ర మోడీ, కేసీఆర్ ల‌కు జగన్ ఊడిగం చేస్తున్నార‌న్నారు. ఈ గ‌డ్డ‌పైనే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని మీకు (జ‌గ‌న్‌) ఓటు ఎందుకెయ్యాల‌న్నారు? జ‌గ‌న్ కి ఓటేస్తే, అది కేసీఆర్ కి వేసిన‌ట్టే అన్నారు చంద్ర‌బాబు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు వెళ్తే.. ఆంధ్రావాళ్ల పాల‌న కావాలా అని కేసీఆర్ అడిగార‌నీ, ఇప్పుడు ఇక్క‌డ తెలంగాణా వాళ్ల పాల‌న కావాలా అని మండిప‌డ్డారు ముఖ్య‌మంత్రి. ఇలాంటివారికి ఊడిగం చేసే జ‌గ‌న్ కి ఓటెయ్యాలా అని ప్ర‌జ‌ల‌ను అడుగుతున్నా అన్నారు. ఆంధ్రాలో ఈయ‌న‌కి (జ‌గ‌న్‌) ఒక్క సీటు వ‌చ్చినా, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మ‌న ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. కేసీఆర్ అంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇస్తాన‌న్నారు క‌దా, అలాంట‌ప్పుడు ప్ర‌త్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వ‌డానికి నాకు అభ్యంతరం లేద‌ని కేసీఆర్ తో కేంద్రానికి ఎందుకు లేఖ రాయించ‌లేద‌న్నారు? జ‌గ‌న్ కి కొన్ని సీట్లొస్తే, అవి కేసీఆర్ అకౌంట్లో వేసుకుని రాష్ట్ర ప్రయోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. మొత్తంగా, ముఖ్య‌మంత్రి ప్ర‌సంగ‌మంతా ఎన్నిక‌ల పాయింటాఫ్ వ్యూ నుంచి సాగింది. జ‌గ‌న్ కి ఓటేస్తే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌వ‌నే అంశాన్ని స్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇవే అంశాలను ప్ర‌ధాన అజెండాగా టీడీపీ ప్ర‌చారంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అవ‌కాశ‌ముంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మద్యం ప్రియులకు షాక్ – 48గంటలు వైన్స్ బంద్

మద్యం ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. శనివారం నుంచి 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైన్స్ షాపులను క్లోజ్ చేయాలంటూ ఎన్నికల సంఘం...

రేవంత్ వేటకు కారణమేంటి?

మాజీ మంత్రి మల్లారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారా? రాష్ట్రంలో భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఎందరో ఉండగా.. వరుసగా ఆయన అక్రమాస్తులపైనే దాడులు ఎందుకు చేయిస్తున్నారు? రేవంత్ తో...

క్యాడర్‌ని కేసుల పాలు చేసి కేటీఆర్ ఏం సాధిస్తారు !?

తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్న ఆతృతతో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంది. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డితో ముడి పెట్టడం.. తెలంగాణకు ఏదో అయిపోయిదన్నట్లుగా ప్రచారం చేస్తూండటం ఎబ్బెట్టుగా...

రేవ్ పార్టీ కేసు…నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చిన వారందరికీ నోటీసులు ఇచ్చారు. టాలీవుడ్ నటి హేమ కూడా డ్రగ్స్ పాజిటివ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close