ప్రభుత్వానికి ఖర్చు..! సీబీఐకోర్టుకు రాలేనని ఏపీ సీఎం పిటిషన్..!

తాను ముఖ్యమంత్రినని… కోర్టుకు హాజరు కావడం.. వల్ల ప్రజాధనం ఖర్చు అవుతుందని.. అందువల్ల… కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని.. తాను ప్రతీవారం కోర్టుకు రావడం వల్ల ప్రజాధనం భారీ ఎత్తున ఖర్చవుతుందని జగన్ … మినహాయింపు కోసం కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. తరచుగా కోర్టుకు హాజరైతే.. పరిపాలన దెబ్బతింటుందన్నారు. సీఎం హోదాలో ఉన్నందున కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్‌తోపాటు భద్రతకు భారీగా వ్యయం అవుతుందని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అక్రమాస్తుల కేసులో … ప్రతీ శుక్రవారం ..సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయనపై ఉన్న కేసులు అత్యంత తీవ్రమైనవి కావడంతో.. బెయిల్ ఇచ్చే సమయంలో అనేక కఠిన నిబంధలు పెట్టారు. విచారణ విషయంలోనూ.. కోర్టులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించాయి. పాదయాత్ర చేసే సమయంలో ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం కనిపించలేదు. అప్పట్నుంచి ఎప్పుడైనా వ్యక్తిగత కారణాలతో.. కోర్టుకు డుమ్మా కొడుతున్నారు కానీ.. ఎక్కువసార్లు కోర్టుకెళ్లి వస్తున్నారు. సీఎం అయిన తర్వాత మాత్రం ఒక్క సారి కూడా.. సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు.

క్విడ్ ప్రో కో కేసుల్లో.. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వాటిపై .. చార్జిషీట్లు దాఖలు చేసి.. విచారణ ప్రక్రియ ప్రారంభదశలో ఉంది. గత ఐదేళ్ల కాలంలో .. నాంపల్లిలోని సీబీఐ కోర్టు ప్రతీ శుక్రవారం.. విచారణ జరుపుతోంది. అయితే.. విచారణ ప్రక్రియ మాత్రం.. ఏదో కారణంగా.. ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో.. జగన్ సీఎం అయ్యారు. సీఎం హోదా రావడంతో.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close