రంగుల పనైపోయింది.. ఇక సర్టిఫికెట్లపై జగన్ బొమ్మలు..!

రంగులు, ఫోటోల వైరస్ సర్టిఫికెట్లకూ పాకింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న కులధృవీకరణ పత్రాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిద్విలాసరూపం దర్శనమిస్తోంది. ఇప్పటి వరకూ కులధృవీకరణ పత్రం అంటే..కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ముద్ర మాత్రమే ఉంటుంది. ఏ ప్రభుత్వం.. ఏ ప్రభుత్వాధినేత కూడా.. సర్టిఫికెట్లపై తమ ఓ బొమ్మ వేయాలని ఆలోచన చేయలేదు. తొలి సారిగా ఏపీ సర్కార్.. కు ఆ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా.. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ముద్ర.. మరో వైపు జగనన్న చిద్విలాస రూపం పెట్టేశారు. ఆ మేరకు ముద్రిస్తూ.. కుల ధృవపత్రాలు మంజూరు చేస్తున్నారు.

ఇవి బయటకు రావడంతో.. ఇదేమి చోద్యం అని… కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి… వేసుకున్న రంగులు.. పెట్టుకున్న బొమ్మల ట్రెండ్ ను పరిశీలిస్తే.. ఇదేమంత పెద్ద విషయం కాదనే విషయాన్ని అంచనా వేయవచ్చని అంటున్నారు. ప్రభుత్వ ధృవీకరణ పత్రాల్లో ఎక్కడా… రాజముద్ర తప్ప.. వ్యక్తుల పేర్లు..ఫోటోలు ఉండేవి కావు. ఇక నుంచి ట్రెండ్ ప్రారంభమైనట్లే భావింవచ్చు. కొద్ది రోజుల కిందట… ముఖ్యమంత్రి.. ఇళ్ల స్థలాల పంపిణీ సందర్భంగా.. లబ్దిదారులుక రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తామని చెబుతూ.. ఆ నమూనా పత్రాలను విడుదల చేశారు. అవి వైసీపీ రంగులో ఉన్నాయి.

నిజానికి ఇవి తెలురు రంగులోనే ఉంటేనే చెల్లుబాటవుతాయి. కానీ ఏపీ సర్కార్ వాటిని వైసీపీ పార్టీ రంగుల్లోకి మార్చింది. ఇప్పుడు ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రిస్తున్నారు. మున్ముందు.. డిగ్రి సర్టిఫికెట్లపైనా కూడా… జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రిస్తారేమోనన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు సెటైర్లు అనుకున్నవే.. రేపు నిజమవుతున్నాయి కాబట్టి.. జరిగినా జరగొచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close