సబ్‌కమిటీతో జగన్ సాధిస్తారు..! ఏపీ కోల్పోతుంది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి.. మొదటి మాటగా.. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ ప్రజల ముందు పెడతానని చెబుతున్నారు. ఆ దిశగా .. ఈ నెల రోజుల్లోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, టెండర్లపై… ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడానికి… ఓ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ప్రతీ ఫైలునూ చదవాలని నిర్ణయించారు. లోపాలు ఉంటే.. ప్రజల ముందు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు.

ఐదేళ్ల ఫైల్స్ చూస్తే ఏదో ఒకటి దొరక్కపోదా..?

గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్ష చేయాలనుకోవడం.. ఓ రకంగా… చాలా అసాధారణమైన నిర్ణయమే. దేశంలో ఇంత వరకూ.. ఏ ప్రభుత్వం కూడా.. అంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు వెదికి మరీ.. ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడలేదు. అప్పటికే బయటకు వచ్చిన… సాక్ష్యాలతో సహా.. ఉన్న కేసులను మాత్రం వదిలి పెట్టలేదు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది మాత్రం… వేరు.. గత ఐదేళ్లలో.. ఏదో ఒకటి జరిగే ఉంటుందని.. దాన్ని పట్టుకుని… తమ లక్ష్యం నెరవేర్చుకోవాలనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి.

“క్విడ్ ప్రో కో” జరిగితేనే నేరం..!

నిజానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ల పాటు పరిపాలన చేసింది. సమీక్ష చేసినా… మరోకటి చేసినా… నిబంధనలకు అనుగుణంగా.. ఆ నిర్ణయాలు ఉంటే.. ఎలాంటి చర్యలు తీసుకోలేరు. క్విడ్ ప్రో కో జరిగినట్లుగా ఆధారాలు ఉంటే మాత్రం… కేసులు నమోదు చేయవచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ తెలుసు. ఆయన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రైవేటు సంస్థలకు.. ప్రభుత్వం తరపున ప్రయోజనాలు కల్పించి.. ఆ మేరకు… జగన్ లబ్ది పొందినట్లు.. సీబీఐ చార్జిషీట్లు వేసింది. ఆ తరహా ప్రయోజనాలు… ఎవరైనా పొంది ఉంటే మాత్రం.. కచ్చితంగా కేసులు నమోదు చేయవచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండా… ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడితే మాత్రం.. అది ప్రమాదకరమే.

ఆరోపణలు చేయడానికి మాత్రం కావాల్సినంత సరుకు..!

సబ్ కమిటీ.. కేవలం.. ఫైళ్లలో.. అంశాలను తీసి.. ఆరోపణలు మాత్రమే చేయగలుగుతుంది కానీ… న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కష్టమన్న అభిప్రాయం… న్యాయనిపుణుల్లో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు.. ఇప్పుడు కూడా.. గత ప్రభుత్వం ఒక్క ఎలుకను పట్టుకోవడానికి రూ. 8 లక్షలు ఖర్చు చేసిందని.. దోమలు ఆడోమగో తెలుసుకోవడానికి రూ. కోటిన్నర ఖర్చు చేసిందని… ప్రజావేదికకు రూ. పది కోట్లు ఖర్చు చేసిందని ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఇలాంటివి జరిగి ఉంటే.. తక్షణం చర్యలు తీసుకోవడానికి అధికారం ఉన్నప్పటికీ.. ఎందుకు.. ప్రచారానికే పరిమితమవుతున్నారో… సామాన్య జనానికి అర్థం కావడం లేదు. వాటికి సంబంధించిన అధికారపత్రాలు, జీవోలు బయట పెడితే.. నిజం తెలుస్తుంది. కానీ.. ప్రస్తుతానికి ప్రభుత్వ లక్ష్యం.. కేవలం.. గత ప్రభుత్వం అలా చేసిందట.. ఇలా చేసిందట..అని ప్రజలు అనుకునేలా చేయడమేనంటున్నారు. అంతకు మించి.. సబ్ కమిటీ కూడా… ఏమీ చేయలేదని.. చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పేరు మార్చుకుంటారా..?పోస్ట్ వైరల్..!!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ఇక పేరు మార్చుకునేందుకు రెడీ అవ్వాలంటూ జన సైనికులు రూపొందించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది....

వైసీపీ సోషల్ మీడియా దుకాణ్ బంద్ !

పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక...

విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే...

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close