సీబీఐకి కొత్త సాక్ష్యాలు ఇచ్చిన వివేకా కుమార్తె..!?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ఎదుట… ఆయన కుమార్తె సునీత హాజరయ్యారు. సునీత తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు.. పలు ఫైళ్లను.. సీబీఐ అధికారులకు అందజేసిన‌ట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు గంటల పాటు.. ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైలు ప్రాంగణానికి విచారణ స్థలాన్ని మార్చిన అధికారులు… ప్రతీ చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాలతో పాటు… ఇప్పటి వరకూ సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలును… సేకరించారు. టీంను 30 మందికి పెంచుకుని…. కేసుతో లింక్ ఉన్న ప్రతి విషయాన్ని కూపీ లాగుతున్నారు.

సునీత వేసిన పిటిషన్‌పైనే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ ప్రకారం.. ఆమె తన పిటిషన్‌లో 15 మంది అనుమానితుల్ని పేర్కొన్నారు. వారిపై ఎందుకు అనుమానం వ్యక్తం చేయాల్సి వచ్చిందో కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. వాచ్‌మన్‌ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ మనోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిగా పిలిచే మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరందరిపై తనకు ఉన్న అనుమానాలకు కారణాలు పిటిషన్‌లో పేర్కొంది. ఆ అనుమానాలకు ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

వివేకా కుమార్తె పిటిషన్ ఆధారంగా విచారణ జరుపుతున్నందున.. ఆమె అనుమానం వ్యక్తం చేసిన అందర్నీ సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను కూడా పిలిపిస్తారని అంటున్నారు. సీఐ శంకరయ్యను ఇప్పటికే విచారించారు. వరుసగా రెండు రోజుల పాటు విచారణ జరిగింది. వాచ్‌మెన్ రంగయ్యను కూడా ప్రశ్నించారు. త్వరలో సాక్ష్యాలు తుడిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులిస్తారని అంటున్నారు. విచారణ జరుగుతున్న తీరుపై… ఒక్క విషయం కూడా బయటకు రాకుండా.. సీబీఐ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close