హిందూపురం : బాలకృష్ణకు శ్రమ లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు !

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవని నియోజకవర్గం హిందూపురం. మొదట ఎన్టీఆర్.. తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. బాలకృష్ణ రెండో సారి గెలిచారు. రాయలసీమలో టీడీపీ గెలిచిన రెండు మూడింటిలో హిందూపురం ఒకటి. అంతకు ముందు కన్నా బాలకృష్ణ మెజార్టీ పెంచుకున్నారు. అన్ని సార్లు గెలవడానికి టీడీపీకి ఎంత లక్ ఉందో.. ఇతర పార్టీలు అక్కడ వ్యూహాత్మకం గా రాజకీయాలు చేయలేకపోవడం కూడా టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలవడానికి మరో కారణం. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు.

తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఏకతాటిపై ఉంటారు. కానీ వైఎస్ఆర్‌సీపీలో ఒకరికి ఐదుగురు నేతలు ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వారిని తీసుకొచ్చి పార్టీ హైకమాండ్ వారిని రద్దుతూండటంలో నేతలు పెరిగిపోతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందన్నట్లుగా అక్కడ వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి మారింది. ముందుగా నవీన్ నిశ్చల్ అనే నేత ఉండేవారు. ఆయనను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే్ అబ్దుల్ ఘనీని పార్టీలో చేర్చుకున్నారు. చివరికి ఆయనను కూడా కాదని కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్‌కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. వారితో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి అనే మరో నేత కూడా నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.

వైసీపీ హైకమాండ్ ఇక్బాల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే ఆయన మాజీ పోలీసు అధికారి. అలాగే డీల్ చేస్తున్నారు. మిగతా ముగ్గుర్ని పట్టించుకోవడం మానేశారు. ఇటీవల వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వంకార్యక్రమాన్ని వదిలేసి ఇక్బాల్ వ్యక్తిగత పర్యటన కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. ఎంపీ మాధవ్‌కు బాధ్యతలిచ్చి వెళ్లారు. దీంతో నవీన్ నిశ్చల్, అబ్దుల్ గని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి అవమానంతో రగిలిపోయారు. తాము మాజీ సమన్వయకర్తలమేనని.. తమకూ గడపగడపకూ నిర్వహించేసత్తా ఉందని ప్రత్యేకంగాసమావేశాలు పెట్టుకుంటున్నారు. గతంలో వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఇక్బాల్… తమ ముగ్గురిలో ఎవరినీ కాదని మళ్లీ ఎంపీని తెచ్చి పెట్టడంతో ముగ్గురు నేతలూ విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చారు. ఇన్చార్జిలుగా మా హిందూ పురానికి చెందిన స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ లోకల్ సెంటిమెంట్ ను వినిపించడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ , ఎంపీ గోరంట్ల మాధవ్ నాయకత్వం మాకు వద్దంటూ తెగేసి చెబుతున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న హిందూపురం దశ తిరిగిపోయింది. ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేశారు. మంచి నీటి పథకాన్ని పూర్తి చేశారు.రూ. వందల కోట్లతో అభివృద్ధి జరిగింది. ఈ కారణంగానే బాలకృష్ణ కు మెజార్టీ పెరిగింది.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రూపాయి అభివృద్ధి జరగకపోగా… సంక్షేమ పథకాల్లో వివక్ష చూపించడం కూడా వివాదాస్పదమయింది. ఇక హిందూపురం కేంద్రం లోక్‌సభ నియోజకవర్గం ఉన్నప్పటికీ జిల్లా చేయకుండా పుట్టపర్తిని జిల్లా చేయడంతోప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నేతలను సమన్వయం చేయకుండా… హిందూపురంలో బాలకృష్ణను ఢీకొట్టేలా పార్టీని సిద్ధం చేయలేరని వైసీపీ వర్గాలు గొణుక్కుటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close