చైతన్య : అధికారులపై అధికార రుబాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారులపై అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేరుగా ఎస్పీ, కలెక్టర్లకు చేసిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే.. వైసీపీ నేతలకు.. అధికారులపై సవారీ చేయడం సులువుగా మారింది. పెద్దలను చూసి.. కిందిస్థాయి నేతలు..అధికారులంటే.. తాము చెప్పినట్లే చేసేవారన్న అభిప్రాయానికి వచ్చారు.

అధికారులపై రుబాబుకి ప్రభుత్వ పెద్దలే దారి చూపిస్తున్నారు..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట వినేవారికి మాత్రమే అందలం ఎక్కిస్తోంది. తప్పో.. ఒప్పో తాము చెప్పింది.. ప్రశ్నించకుండా చేసే వారు మాత్రం.. కీలక స్థానాల్లో ఉంటున్నారు. కాదంటే.. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా.. అనేక మంది ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్లిపోయారు. ప్రశ్నిస్తే సస్పెండేనని… నర్సీపట్నంలో డాక్టర్.. నగరి మున్సిపల్ కమిషనర్ వ్యవహారంతో ప్రభుత్వం సంకేతాలు పంపింది. ఇంకా ఎదురు తిరిగితే.. ఎస్‌ఈసీ లాంటి రాజ్యాంగ బద్ధ పదవిని కూడా.. తొలగించగలమని ప్రభుత్వం నిరూపించింది. ఇవి వైసీపీ నేతలకు.. మోరల్ సపోర్ట్‌గా నిలిచాయి. దాంతో.. తాము అధికారులపై ఎలా విరుచుకుపడినా తప్పు లేదన్న భావనలోకి వైసీపీ నేతలు వచ్చారు. తమ నేతలు ఏం చేసినా.. బాధ్యతల్లో ఉన్న వారు చూసీ చూడనట్లు ఉంటున్నారు. అంటే అంగీకారం తెలుపుతున్నట్లే. ఫలితంగా.. అధికారులు.. యంత్రాంగం మొత్తం… ఓ రకమైన అవస్థను ఎదుర్కొంటున్నారు..

లొంగిపోతున్న అధికారుల తప్పిదమూ ఉంది..!

అధికార పార్టీ ఐదేళ్లకోసారి మారుతూ ఉంటుంది. కానీ అధికారులు రిటైరయ్యే వరకూ ఉంటారు. అధికార పార్టీ మళ్లీ ఎన్నికలు జరిగే వరకే ఉంటుంది. కానీ అధికార యంత్రాంగం శాశ్వతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమే సుప్రీం. ఆ ప్రభుత్వంలో అధికార యంత్రాంగమే పనులు చేయాల్సిన వ్యవస్థ. రాజకీయనేతలు.. ఆదేశాలు మాత్రమే ఇవ్వగలరు. పనులు చేయాల్సింది అధికారులు. ఆ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమైతే… చట్టానికి వ్యతిరేకంగా ఉంటే.. అధికారులు ఆ విషయాన్ని .. ప్రభుత్వ పెద్దలకు చెప్పి నిలువరించాలి. లేకపోతే.. తాము కూడా ఆ తప్పుల్లో భాగస్వాములవుతారు. గతంలో అలా క్విడ్ ప్రో కో వ్యవహారాల్లో ఇరుక్కుని జైళ్లకు వెళ్లిన ఉన్నతాధికారుల్ని చూశాం. ఆ తర్వాత ప్రభుత్వం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం కుదిరినప్పటికీ.. మళ్లీ ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది గడవక ముందే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. అధికారులపై విరుచుకుపడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.

యంత్రాంగం తమ అధికారాల్ని కాపాడుకోవడం ముఖ్యం..!

తమకు అధికారులు సహకరించడం లేదంటూ… హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి..బదిలీలు చేయించుకునే వారు కొందరైతే… అక్కడి వరకూ ఎందుకు… గట్టిగా మాట్లాడితే వారే పనులు చేస్తారని భావించేవాళ్లు మరికొందరు.అధికార పార్టీ నేతలు.. అధికారుల్ని నామమాత్రంగా తీసుకుంటున్నారు. తాము చెప్పింది చేయాల్సిందేనని తేల్చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా.. చాలా విషయాల్లో వైసీపీ నేతల భాగస్వామ్యం తీసుకోవాలని పరోక్షంగాచెబుతున్నారు. పెన్షన్లు, కరోనా సాయం వంటి వాటిని .. వైసీపీ నేతలతో పంపిణీ చేయించడం వెనుక ఉన్నతాధికారుల పరోక్ష ఆదేశాలున్నాయని.. అధికారవర్గాలు బహిరంగంగానే చెబుతూ ఉంటాయి. వారే నిబంధనలు ఉల్లంఘించమని సలహా ఇస్తూంటే.. తాము ఎందుకు నిబంధనలు పాటించాలన్న భావన కింది స్థాయి ఉద్యోగుల్లో వస్తోంది. నిజానికి ఉన్నతాధికారులు .. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. కానీ ప్రభుత్వం వ్యవహారశైలితో వారు ఒత్తిడికి గురవుతున్నారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close