రఘురామ టార్గెట్‌గా మళ్లీ ఢిల్లీకి వైసీపీ ఎంపీలు..!

రఘురామకృష్ణరాజును సైలెంట్ చేసేందుకు వైసీపీ హైకమాండ్ నలుగురు ఎంపీలకు బాధ్యతలిచ్చింది. ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపింది. ఇప్పటి వరకూచ చేస్తున్న రచ్చతోనే.. చాలా వరకూ.. ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. ఇక ముందు ఆయన నోరు తెరవకుండా ఉండాలంటే ఏం చేయాలో… చెప్పి వారికి దిశానిర్దేశం చేసి పంపారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎటాక్ తగ్గించింది. పెద్దగా ఎవరూ విమర్శలు చేయడం లేదు. సోషల్ మీడియాలోనూ దూషించడం లేదు. అంతకు ముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే… సోషల్ మీడియా డైరక్టర్ పేరుతో ప్రభుత్వ జీతం తీసుకుంటూ… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా వ్యవహరించే… వ్యక్తి.. రఘురామపై బూతులతో దాడి చేసేవారు. ఇప్పుడు అతన్ని కూడా సైలెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

కొద్ది రోజులుగా రఘురామ… సీఐడీ కేసుపై ఎక్కడా మాట్లాడటం లేదు.కానీ.. ఆయన రాష్ట్రపతి నుంచి ప్రతి రాజ్యాంగ వ్యవస్థకు లేఖలు రాస్తున్నారు. తాజాగా గవర్నర్లకూ లేఖలు రాశారు. ఏపీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, రాజద్రోహం కేసు మోపారని ఆరోపించారు. రాజద్రోహం సెక్షన్ 124(A)ను తొలగించాలని కోరారు. జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా తనపై కక్షగట్టి కేసులు మోపి హింసించారని ఆయా లేఖల్లో చెబుతున్నారు. ఎంపీలు, సీఎంలకు రఘురామ లేఖలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు నేతలు వైసీపీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్ళారు.

దీంతో సలహాదారుడు సజ్జల నలుగురు ఎంపీల్ని పిలిచి ప్రత్యేకంగా టాస్క్ అప్పగించారు. ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపారు. అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ అపాయింట్ మెంట్లను వెంటనే తీసుకోవాలని నిర్దేశించారు. వీరితో పాటు… రఘురామ లేఖలు రాస్తే స్పందించిన వారినందర్నీ వైసీపీ నేతలు ప్రత్యేకంగా కలిసి.. తమ వెర్షన్ వినిపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకూ… రఘురామరాజుపై ఒత్తిడి తెచ్చి..ఆయన సైలెంటయ్యేలా చూడాలని.. రకరకాల ప్లాన్లు అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close