బిగ్ బీ పాత్ర‌ని పెంచేద్దామా: ‘సైరా’ కొత్త ప్లాన్‌?

‘సైరా’ కోసం అమితాబ్ బ‌చ్చ‌న్‌ని తీసుకోవ‌డం వెనుక చిరు అండ్ కో ఎత్తుగ‌డ ఏమిట‌న్న‌ది స్ప‌ష్టం. ఈ సినిమాకి బాలీవుడ్ స్థాయిలో మార్కెట్ చేయాల‌ని. అక్క‌డ కూడా భారీ రేటుకి ఈ సినిమాని అమ్మాల‌ని. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. త‌ద్వారా… ‘సైరా’కి బాహుబ‌లి రేంజు హైపు రావాల‌ని. అందులో భాగంగానే అమితాబ్ బ‌చ్చ‌న్‌ని ఒప్పించి, మెప్పించి.. `సైరా` టీమ్ లోకి తీసుకొచ్చారు. ఇందులో బిగ్ బీకి కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ‘సైరా’కి గురువుగా ఆయ‌న క‌నిపించ‌నున్నారు. అయితే సైరా గురువు పాత్ర‌ల‌తో బిగ్ బీకి రాసిన స‌న్నివేశాలు మూడే. స్క్రిప్టు ప్ర‌కారం సినిమా ద్వితీయార్థంలో ఈ పాత్ర క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు `సైరా` బృందo ఆలోచ‌న మారింది. ప్ర‌ధ‌మార్థంలోనూ బిగ్ బీ క‌నిపించాల‌ని, అందుకు త‌గిన స‌న్నివేశాల్ని జోడించాల‌ని ర‌చ‌యిత బృందాన్ని ద‌ర్శ‌కుడినీ చిరు ఆదేశించాడ‌ట‌. ఈ విష‌య‌మై బిగ్ బిని సంప్ర‌దించి మ‌రిన్ని కాల్షీట్లు అడిగార‌ని తెలుస్తోంది. నిజానికి అమితాబ్ పై తీయాల్సిన స‌న్నివేశాల‌న్నీ సింగిల్ షెడ్యూల్‌లో ముగించి ఆయ‌న్ని పంపించేయాలి. అయితే.. స‌న్నివేశాల్ని పొడిగించ‌డం వ‌ల్ల‌… బిగ్ బి కాల్షీట్లు మ‌రిన్ని కావాల్సివ‌చ్చాయి. చిరు మాట‌పై గౌర‌వంతో అమితాబ్ బచ్చ‌న్ కూడా ఈ మార్పుల‌కు అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close