ప‌వ‌న్ సినిమాకి త్రివిక్ర‌మ్ ‘పెన్ను’ సాయం

ద‌ర్శ‌కుడైపోయాక త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా మ‌రో ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తీన్‌మార్ కోసం మాత్రం పెన్ను చేసుకోవాల్సివ‌చ్చింది. మొన్న‌టికి మొన్న‌.. భీమ్లా నాయ‌క్‌కి అంతా తానే అయ్యాడు. ఆ సినిమాకి గానూ త్రివిక్ర‌మ్‌కి భారీ పారితోషికం ద‌క్కింది కూడా. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ కోసం పెన్ను చేసుకోక త‌ప్ప‌డం లేదు.

స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టిస్తున్నాడు. వినోద‌య సీత‌మ్‌కి ఇది రీమేక్‌. ఈ సినిమాకి మాట‌ల ర‌చ‌యిత‌గా బుర్రా సాయిమాధ‌వ్‌ని ఎంచుకొన్నారు. అయితే స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్ర‌మ్‌దే. రీమేక్ క‌థ‌ని ప‌వ‌న్ శైలికి అనుగుణంగా కొన్ని కీల‌క‌మైన మార్పులు చేశాడు త్రివిక్ర‌మ్. అయితే ఇక్క‌డితో త్రివిక్ర‌మ్ ప‌ని అయిపోలేదు. ఇప్పుడు ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ డైలాగులూ రాస్తున్నాడ‌ట‌. త‌న‌కున్న ప్రాజెక్టులు, బిజీ షెడ్యూల్ వ‌ల్ల‌.. బుర్రా సాయిమాధ‌వ్ ఈ సినిమా నుంచి త‌ప్పుకొన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఆ బాధ్య‌త‌ని కూడా త్రివిక్ర‌మ్ మోయ‌బోతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు మ‌హేష్ బాబు సినిమా ప‌నుల్లో త్రివిక్ర‌మ్ త‌ల‌మున‌క‌లైపోయాడు. దానికి తోడు రీమేక్ బాధ్య‌త‌లు త్రివిక్ర‌మ్ త‌న భుజాన వేసుకొన్నాడు. నిజానికి బుర్రా స్థానంలో మ‌రో ర‌చ‌యిత‌ని ఎంచుకోవాల‌ని అనుకొన్నారు. కానీ… ప‌వ‌న్ మాత్రం త్రివిక్ర‌మ్ రాస్తేనే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డంతో..త్రివిక్ర‌మ్‌కి మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. మ‌రి ఈ రెండింటినీ త్రివిక్ర‌మ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close