రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆగిపోలేదు

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తాడు. ఈలోగా క‌న్న‌డ ద‌ర్శ‌కుడు న‌ర్త‌న్ కూడా రెడీగా ఉన్నాడు. ముఫ్తీ సినిమాతో క‌న్న‌డ నాట ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు న‌ర్త‌న్‌. తెలుగులో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు చ‌ర‌ణ్‌కి ఓ క‌థ చెప్పి ఒప్పించుకొన్నాడు. ఈలోగా.. క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌తో న‌ర్త‌న్ ప్రాజెక్టు ఓకే అయ్యింది. అతి త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. దాంతో చ‌ర‌ణ్ తో న‌ర్త‌న్ సినిమా ఉంటుందా? లేదా? అనే డైలామా మొద‌లైంది. చ‌ర‌ణ్‌తో న‌ర్త‌న్ సినిమా ఉండ‌దంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని చ‌ర‌ణ్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. న‌ర్త‌న్‌తో సినిమా ఉంటుంద‌ని, అయితే అది కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని చెబుతున్నారు. శంక‌ర్ తో సినిమా పూర్త‌యిన వెంట‌నే బుచ్చిబాబు సినిమాని మొద‌లెడ‌తాడు చ‌ర‌ణ్‌. ఆ త‌ర‌వాతే.. న‌ర్త‌న్ సినిమా ఉంటుంది. ఈలోగా శివ‌రాజ్ కుమార్‌తో న‌ర్త‌న్ సినిమా అయిపోతుంది కూడా. సో.. చ‌ర‌ణ్ సినిమా ఆగిపోలేదన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close