కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. ఇలా హాజరు కావడం కేటీఆర్ కు అసలు నచ్చడం లేదు. ఆయన తండ్రిని కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని నమ్ముతున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఆవేశపడటం.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. అంతు చూస్తామని హెచ్చరించడం.. అంతకు ముందు తామేదో చేశామని చెప్పుకోవడం అంటే.. అహంకారం అనుకుంటారు. కేటీఆర్ అహంకారం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
00 జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని.. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు అని మీడియా ముందు ఆవేశపడ్డారు. కేటీఆర్ కు అర్థం కాని విషయం ఏమిటంటే..ఆ రేవంత్ రెడ్డే.. కేసీఆర్ పదవి పోయేలా చేశారు. ఇప్పుడు విచారణలకు హాజరయ్యేలా చేస్తున్నారు. ఇంకా ఆయనను వెంట్రుక కూడా పీకలేడని నిందించడంలో అర్థం లేదు.
అంతేనా.. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ అని స్కోత్కర్ష కూడా ఎక్కువగానే చెప్పుకున్నారు. అంటే చంద్రబాబును అన్నారన్నమాట. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎక్కువ కాలం చంద్రబాబు దగ్గర పని చేశారు. కేసీఆర్ గురువు చంద్రబాబు అంటారు. నిజంగా కేసీఆర్ తరిమేశారో లేదో కానీ.. ఈ స్కోత్కర్ష మాత్రం ఎక్కువగా ఉంది. ఇతరుల్ని కించ పరిచి.. అది తమ గొప్పతనం అనుకుంటే.. అది రాజకీయం అవదు.. అహంకారం అవుతుంది. ఇలాంటి అహంకారం ఉన్న వాళ్లు రాజకీయాల్లో ఎదిగిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు.
కేటీఆర్ కు ఇంకా అధికారం అనుభవించిన అహంకారమే కనిపిస్తోంది కానీ.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. మనకు ఎలాంటి పవర్ వచ్చినా అది ప్రజలదే అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు.