వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలు జగన్ పై గతంలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేస్తే వైసీపీ నేతలు తెగ ఇబ్బందిపడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ల నుంచి విడదల రజని వంటి మాజీ మంత్రుల వరకు.. కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ ఫ్యాక్షనిజం, ఆయన రాజకీయ శైలిపై చేసిన పాత వ్యాఖ్యల వీడియోలు, పేపర్ కటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సొంత పార్టీ నేతలే గతంలో జగన్ రెడ్డి నైజాన్ని ఎండగట్టారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేక వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
ఈ ఎదురుదాడిని తట్టుకునేందుకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానితో ప్రెస్ మీట్ పెట్టించింది. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబుపై చేసిన విమర్శల పాత రికార్డులను చూపించి. రాజకీయ విమర్శలు విధానపరంగా ఉండాలి తప్ప, జగన్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ పాత విషయాలను తవ్వడం సరికాదని పేర్ని నాని హితవు పలికారు. అయితే, సొంత పార్టీ నేతలే ఒకప్పుడు విలన్ గా అభివర్ణించిన వ్యక్తిని ఇప్పుడు ఆరాధ్య దైవం గా కొలవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
జగన్ పై అలా మాట్లాడవదని..మావిగన్ గురించి మాట్లాడాలని పేర్ని నాని అంటున్నారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమని, రాష్ట్ర నిధులన్నీ అక్కడే ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాలు ఏమైపోతాయనే ప్రచారాన్ని వైసీపీ చేయాలనుకుంటుంది. ఆ చర్చ జరగాలని కోరుకుటోది. పాత వీడియోల యుద్ధం వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. గతంలో జగన్ను తీవ్రంగా దూషించిన వారే ఆయన కేబినెట్లో మంత్రులుగా పని చేశారని.. ఇప్పుడు వారే రివర్స్ రాజకీయం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల అలా చెప్పినందుకు బొత్స ఏడ్చారు. అందుకే అమరావతి అంశాన్ని మళ్ళీ వివాదాస్పదం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
