జనతా గ్యారేజ్ రిజల్ట్…ఇండస్ట్రీకి డౌట్స్ ఉన్నాయా?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘జనతా గ్యారేజ్’. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమా లవర్స్‌కి కూడా నచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఉన్న కొరటాల శివపైన బయ్యర్స్‌ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత మాస్ మసాలా ఎంటర్టైనర్‌లో కనిపిస్తుండడం కూడా సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకుని వచ్చింది.

అంతా బాగానే ఉంది కానీ జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయిన ఒన్ వీక్‌లో ఇంకొక్కడు సినిమాతో పాటు చిన్న సినిమాలయిన జ్యో అచ్యుతానంద, వీడు గోల్డ్ ఎహే సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ కూడా ఈ వీక్‌లోనే ఫైనల్ చేశారు. సాధారణంగా మహేష్, పవన్, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోస్ సినిమాలు రిలీజవుతున్నాయంటే ఓ రెండు మూడు వారాల వరకూ మీడియం రేంజ్, స్మాల్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసే ధైర్యం చేయరు. సంక్రాంతి లాంటి పండగ సీజన్ అయితే అది వేరే విషయం. పండగ సీజన్‌లో రెండు, మూడు సినిమాలకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఫెస్టివల్ హాలిడేస్ అడ్వాంటేజ్‌ని మిస్సవ్వకూడదని రిలీజ్ చేస్తారు. జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యాక దాదాపు డిసెంబర్ వరకూ ‘ధృవ’ సినిమా మినహా వేరే పెద్ద సినిమా ఏదీ లేదు. అయినా కూడా జనతా గ్యారేజ్‌తో పోటీ పడాలని ఎందుకనుకుంటున్నారబ్బా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close